పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు సినిమాలకు పవన్ సైన్ చేశారనే వార్తలు టాలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. ‘అజ్ఞాత వాసి’ తర్వాత పవన్ సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత ఇప్పుడు ‘పింక్’ సినిమా రీమేక్‌తో తెలుగు ప్రజలను పలకరించబోతున్నారు. అలాగే.. పలువురు దర్శక నిర్మాతలు కూడా పవన్‌తో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఈ సందర్భంగానే మరో రెండు సినిమాలకు పవన్ సైన్ చేశారని టాక్. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా!
తాజాగా బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన సినిమా ‘పింక్’. ఈ చిత్రం అక్కడ అద్భుత విజయం సాధించడంతో.. తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీకపూర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా.. పవన్ షూటింగ్ పిక్స్ మాత్రం వైరల్ అవడంతో ఇది ఖాయమనే తేలింది.
ఇక క్రిష్ డైరెక్షన్‌లో పవన్ రెండో సినిమా చేయబోతున్నారనే టాక్ వైరల్ అయ్యింది. ఇది 2021 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారట. అలాగే ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని, ఇతర భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయో లేదో తెలీదు కానీ.. పవన్ మూడో సినిమాపై ఇప్పటికే పలు వార్తలు గుప్పుమంటోన్నాయి. ఈ సినిమా ‘సైరా’ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథలో పవన్ నటిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల సమచారాం. ‘పండగసాయన్న’ అనే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథలో పవన్ నటిస్తున్నారని, ఈ సినిమాలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. చూడాలి మరి.. కానీ వీటిపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఏదైతేనేం.. పవన్ సినిమా వస్తుందంటే పవన్ ఫ్యాన్స్‌కి సంతోషానికి హద్దే ఉండదు.