డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార బ్రేకప్ చెప్పిందా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ అవుతోంది. ఇందుకు కారణం.. ఆమె న్యూయర్ రోజు దిగిన ఫొటోలేనట. ప్రస్తుతం నయనతారకు సంబంధించి ఇదే విషయం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే అగ్రనటిగా పేరు సంపాదించుకున్న నయన్.. పెళ్లి విషయంలో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. నిజంగానే పెళ్లి నయనతారకి అచ్చి రాదా?
తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్ హీరోయిన్‌గా నయనతార కొనసాగుతోంది. 2004లో ‘చంద్రముఖి’సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. దాదాపు 15 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కనిపిస్తూనే ఉంది. మొదట శింబు, ఆ తరువాత ప్రభుదేవలతో పెళ్లి దాకా వచ్చిన ఆమె ప్రేమ ప్రయాణం.. మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం విఘ్నేష్‌తో ప్రేమలో పడింది.
ఏ పండుగైనా.. ఎలాంటి సెలెబ్రేషన్స్ అయినా వీరు విదేశాల్లో వాలిపోతూంటారు. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూంటారు. అలా 2020 న్యూయర్‌కి కూడా వారు విదేశాలకు కలిసి వెళ్లారు. అయితే ఏమైందో ఏమోకానీ.. వారు తీసుకున్న సెల్ఫీ ఫొటోలను విడివిడిగా షేర్ చేస్తూ న్యూయర్ విషెస్ తెలిపారు. అప్పుడు దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. తాజా పరిణామాలతో నయనతార మూడో ప్రేమ కథ కూడా కంచికి చేరిందనే ప్రచారం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లి విషయంలో వీరిద్దరికి మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. పెళ్లి విషయం వచ్చేసరికి.. నయనతార సమయం కావాలంటోందట. కానీ.. శివన్ ఇంట్లో మాత్రం పెళ్లికి తొందరపెడుతున్నారని అందుకే.. ఆ విషయంపై వీరిద్దరూ గొడప పడ్డారని సోషల్ మీడియా ప్రచారం.
இனிய ஆங்கில புத்தாண்டு நல்வாழ்த்துக்கள் ?Happy New Year 2020? pic.twitter.com/6Y9jI3J5WR
— Nayanthara✨ (@NayantharaU) December 31, 2019