Megastar Chiranjeevi: మూడేళ్లు వరుసగా మెసేజ్స్ చేసిన చిరంజీవి.. పట్టించుకోని యాంకర్ సుమ.. అసలు విషయం బయటపెట్టిన మెగాస్టార్..

|

Jan 16, 2023 | 5:37 PM

తాను వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తే సుమ పట్టించుకోలేదని.. ఒకటి రెండు కాదు..దాదాపు 3 నుంచి 4 ఏళ్లపాటు మెసేజ్ లు పెట్టినా.. సుమ మాత్రం కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పారు. దీంతో సుమ కూడా పశ్చాత్తాపంతో వివరణ ఇచ్చింది.

Megastar Chiranjeevi: మూడేళ్లు వరుసగా మెసేజ్స్ చేసిన చిరంజీవి.. పట్టించుకోని యాంకర్ సుమ.. అసలు విషయం బయటపెట్టిన మెగాస్టార్..
Megastar Chiranjeevi, Suma
Follow us on

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఎప్పుడూ రియాల్టీ షోలకు దూరంగా ఉండే చిరు.. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా షోలో పాల్గోన్నారు. ఇందులో డైరెక్టర్ బాబీ, కమెడియన్ వెన్నెల కిషోర్ లతో కలిసి సందడి చేశారు. అయితే ఈ షోలో యాంకర్ సుమ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు చిరు. తాను వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తే సుమ పట్టించుకోలేదని.. ఒకటి రెండు కాదు..దాదాపు 3 నుంచి 4 ఏళ్లపాటు మెసేజ్ లు పెట్టినా.. సుమ మాత్రం కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చెప్పారు. దీంతో సుమ కూడా పశ్చాత్తాపంతో వివరణ ఇచ్చింది.

ఈ షోలో చిరు మాట్లాడుతూ.. ఎంత అన్యాయం అంటే ఈ అమ్మాయి.. ప్రజలకు చెప్పేస్తున్నా.. లీక్ చేసేస్తుతన్నా.. సుమ పుట్టినరోజుకు విషెస్ చెప్తూ వరుసగా 3- 4 సంవత్సరాలు మెసేజ్ చేశాను. కానీ.. ఒక్కసారి కూడా ఆమె నుంచి రిప్లై లేదు. చిరంజీవి మెసేజ్ కు సమాధానం చెప్పని.. రిప్లై ఇవ్వని ఒకే ఒక వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉన్నారంటే ? అది సుమ అని అన్నారు. దీంతో వెంటనే సుమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇలా జరిగి మూడేళ్లు అవుతోందని నాకు తెలియదు. 2022లో చిరంజీవి గారు ఫోన్ చేసి హ్యాపీ బర్త్ డే అని చెప్పి.. ఇలా మూడేళ్ల నుంచి మెసేజ్ లు చేస్తున్నాను అని చెప్పారు. ఎవరు అనుకుంటారండి చిరంజీవి గారు నాకు మెసేజ్ చేస్తారని అంటూ మాట్లాడుతుండగా.. కమెడియన్ వెన్నెల కిషోర్ వెంటనే మాట్లాడుతూ.. వివరణ పెద్ద కన్విన్సింగ్ గా లేదు అంటూ కౌంటరిచ్చారు. దీంతో సుమ కోపంగా అతడిని కొట్టబోయింది. చిరంజీవి సార్.. సెకండ్ ఇయర్ సుమ రిప్లై ఇవ్వకపోయినా..మీరు మూడో సంవత్సరం కూడా మెసేజ్ చేశారు చూడండి.. మీరు గ్రేట్ సార్ హ్యాట్సాఫ్ అండు దండం పెట్టేశాడు.

దీంతో చిరు మాట్లాడుతూ.. రిప్లై ఇవ్వకపోవడం తన గర్వం. సారీ.. తన నైజం అయినా.. అలాంటి వారిని విష్ చేయడం నా నైజం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. నిజంగా చెప్తున్నాను. చిరంజీవిగారు నాకు ఎందుకు మెసేజ్ చేస్తారనే ఫీలింగ్ లోనే ఉన్నాను.. అంతే తప్ప అని మళ్లీ మాట్లాడబోయింది. దీంతో తన పక్కనే ఉన్న బాబీతో … చెప్పానా.. సుమ చాలా జోక్స్ వేస్తారని అంటూ మళ్లీ కౌంటరిచ్చారు వెన్నెల కిషోర్. ఇక చివరకు చిరంజీవి క్లారిటీ ఇచ్చేసారు. తాను చేసిన మెసేజ్ లను సుమ కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.