భారీగా ‘రెమ్యునరేషన్‌’ పెంచేసిన ‘గద్దలకొండ గణేష్’..! ఎంతో తెలుసా..?

| Edited By:

Oct 12, 2019 | 12:51 PM

ఒకే విధమైన సినిమాలు కాకుండా.. తన ఒక్కో సినిమాలో కొత్త యాంగిల్‌ ఉండేలా.. సినిమా చేసుకుంటూ.. వరుస విజయాలు సాధిస్తున్నాడు మన ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం మెగా హీరోల్లో అందరికంటే.. ఫాస్ట్‌గా.. ప్రేక్షకులకు దగ్గరయ్యింది వరుణ్‌ అనే చెప్పాలి. తొలిప్రేమ, ఎఫ్‌2, తాజగా గద్దలకొండ గణేష్‌ సినిమాలతో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో వరుణ్ తన నటనతో […]

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన గద్దలకొండ గణేష్..! ఎంతో తెలుసా..?
Follow us on

ఒకే విధమైన సినిమాలు కాకుండా.. తన ఒక్కో సినిమాలో కొత్త యాంగిల్‌ ఉండేలా.. సినిమా చేసుకుంటూ.. వరుస విజయాలు సాధిస్తున్నాడు మన ‘గద్దలకొండ గణేష్’ అలియాస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం మెగా హీరోల్లో అందరికంటే.. ఫాస్ట్‌గా.. ప్రేక్షకులకు దగ్గరయ్యింది వరుణ్‌ అనే చెప్పాలి. తొలిప్రేమ, ఎఫ్‌2, తాజగా గద్దలకొండ గణేష్‌ సినిమాలతో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు.

‘గద్దలకొండ గణేష్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో వరుణ్ తన నటనతో విజృంభించాడనే చెప్పాలి. దీంతో.. ఎటు చూసినా.. గద్దలకొండ గణేష్ టాక్‌నే వినిపించింది. ఒక్కసారిగా.. వరుణ్‌కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆఫర్లన్నీ క్యూ కట్టాయి. సినిమా ప్రాజెక్టులకు వరుసగా సంతకాలు చేసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆసక్తిరమైన విషయం ఏంటంటే.. బ్లాక్‌ బస్లర్ హిట్‌ తర్వాత.. మెగాప్రిన్స్ తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. మరి ఎంతో తెలుసుకోవాలని ఆసక్తి మీకు ఉంది కదా.. అక్కడికే వస్తునా.. ప్రస్తుతం వరుణ్ చేసే సినిమాకి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నాడు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే.. సామెత’ను మన మెగా ప్రిన్స్ బాగా ఫాలో అవుతున్నాడు.

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న కొత్త సినిమా వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి న్యూ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాను అల్లు వెంకటేష్, ముద్దా సిద్ధూ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.