Mahesh Babu : ‘మహేశ్ 27’వ మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మోహమాటాలకు పోయి మూటగట్టుకున్న ప్లాపుల విషయంలో మహేశ్ కొత్త పాఠాన్ని నేర్చుకున్నట్టు తెలుస్తోంది. సరిలేరు తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్‌లో ఆయన మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే అన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే లైన్ చెప్పి ఎగ్జైట్ చేసిన వంశీ..పూర్తి స్క్రిప్ట్‌తో మెస్మరైజ్ చేయలేకపోయాడట. అందుకే బెస్ట్ ప్రెండ్ అయినప్పటికి వంశీ పైడిపల్లి మూవీ పక్కన పెట్టాడు మహేశ్. కొంతటైమ్ తీసుకోని స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దిన అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఈ గ్యాప్‌లో మరో మూవీవైపు మహేశ్ మనసు మళ్లినట్టు తెలుస్తోంది. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ ‘గరుడవేగ’ చిత్రాలను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు ఓ కథ వినిపించాడని, అది థ్రిల్లింగ్‌గా అనిపించడంతో మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా అతి త్వరలోనే ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ అనంతరం విదేశాలకు వెళ్లిన మహేశ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ రిలీజై 40 రోజులు దాటిన నేపథ్యంలో..మరో 10 రోజుల్లోనే ఆయన తదుపరి మూవీపై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.