Karthika Deepam: దీపని ట్రీట్మెంట్ కోసం ఒప్పించే ప్రయత్నంలో డాక్టర్ బాబు.. కార్తీక్ ని కలవడానికి బయలుదేరిన మోనిత

| Edited By: Janardhan Veluru

Apr 14, 2021 | 4:26 PM

మేడం మీకోడలి కాసేపు నాతో పంపిస్తావా అని అంటే.. సౌండ్ చాలా దరిద్రంగా ఉంది సుపుత్ర.. నా భార్యని కాసేపు బయటకి తీసుకుని వెళ్తాను అనలేవా అంటుంది. సౌందర్య.. దాన్నే పంపిస్తావా లేదా...

Karthika Deepam: దీపని ట్రీట్మెంట్ కోసం ఒప్పించే ప్రయత్నంలో డాక్టర్ బాబు.. కార్తీక్ ని కలవడానికి బయలుదేరిన మోనిత
Karthika Deepam
Follow us on

Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం సీరియల్. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతూ దాదాపు మూడేళ్లకు పైగా ప్రసారం అవుతుంది. కార్తీక్ దీపం ఈరోజు 1013 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టి మంచి రసపట్టులో సాగుతుంది. ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!

దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో రెస్ట్ కోసం రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు కార్తీక్. తర్వాత దీప ఉన్న రూమ్ కి వస్తాడు.. సౌందర్య పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్తుంది. కార్తీక్ దీప దగ్గర కూర్చుని .. పడుకో అని అంటాడు పిల్లలు కూడా నన్ను అపార్ధం చేసుకున్నారు.. నీకు బాగోలేకపోతే నేను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు. ఎందుకు వాళ్ళముందు నన్ను కర్కోటకుడిగా మారుస్తున్నావు అని అంటాడు దీపతో.. దీప మౌనంగా ఉండడంతో. నీరసంగా ఉండి మాట్లాడడం లేదా.. లేక పొగరుతో మాట్లాడడం లేదా అని ప్రశ్నిస్తాడు. నా బతుక్కి పొగరు ఒకటే తక్కువ అంటుంది దీప. మరి ఏమిటిది సెల్ఫ్ రిస్పెక్టా.. మీకు అర్ధమైతే నాకీ ఖర్మ ఎందుకు అంటుంది దీప.. మరి ఎవరు చెబితే వింటావ్. అని అంటుంటే.. హిమ శౌర్యలు డాడీ అంటూ గది లోపలికి వస్తారు.

అమ్మకి ఇలా ఉందని భయపడుతున్నారా అని ప్రశ్నిస్తాడు కార్తీక్.. దీంతో శౌర్య.. నువ్వు హాస్పటల్ కి తీసుకుని వెళ్లడం లేదని భాధపడుతున్నాం అంటారు. నేను విజయనగరంలో ఉన్నపుడు రిపోర్ట్స్ చూశాను.. కాగా రక్తం తక్కువగా ఉంది.. చాలా బలహీనంగా ఉంది.. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకున్నా కానీ మీ అమ్మ హాస్పిటల్ కి రాను అంది. అయినా సరే ఆ రిపోర్ట్స్ బట్టి నేనుమందులు తెచ్చాను.. వేసుకోను అంది.. మీ అమ్మ తాతయ్యతో కూడా మందులు పంపించాను.. వాటిని చెత్త బుట్టలో వేసింది.. మీకు నేను ఎందుకు మంచి ఆసుపత్రికి తీసుకుని వెల్ళడం లేదు అని అనుమానం రావచ్చు.. కానీ మీ అమ్మకి నేనంటే ఎప్పటి నుంచో కోపం ఉంది. అందుకనే నేను తెచ్చిన మందులు వేసుకోవడం లేదు. హాస్పటల్ కి రావడం లేదు.. ట్రీట్మెంట్ కు ఒప్పుకోవడం లేదు అంటాడు కార్తీక్..

దీంతో శౌర్య.. ఏమిటమ్మా ఏమైంది నీకు అక్కడంటే మందులకు డబ్బులు ఖర్చు అవుతాయని వద్దు అన్నావు. ఇక్కడ ఏమైంది నీకు.. అంటుంది. హిమ కలుగజేసుకుని ఇంతసేపు డాడీనే నిన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లడం లేదనుకున్నాం. కానీ నువ్వు వెళ్లడం లేదా అమ్మా అంటుంది.. నువ్వు ఎందుకు డాడీ మాట వినడం లేదు అని ప్రశ్నిస్తారు. పిల్లలు అడుగుతున్నారు కదా చెప్పు అంటాడు కార్తీక్. నువ్వు డాడీ తెచ్చిన మందులు వేసుకోవడం లేదు అన్నది నిజమా కదా అని ప్రశ్నిస్తే.. నిజమే అంటుంది దీప. నా మీద కోపం పోయిందా .. మందులు తీసుకోవడానికి మీరే మీ అమ్మని ఒప్పించాలి.. ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం.. అదిగో ఆ కనుబొమ్మలు పైకి ఎత్తి ఎలా కోపంగా చూస్తుందో చూడండి.. ఒప్పించండి అని చెప్పి రూమ్ నుంచి వెళ్ళిపోతూ… దీప వైపు ఓ లుక్ వేసి వెళ్ళిపోతాడు..

కార్తీక్ దగ్గరకు వచ్చిన సౌందర్య.. వచ్చి.. దీప ఆరోగ్యం పై ఆరా తీసింది. దీపకి ఏమైంది.. పరిస్థితి ప్రమాద కరంగా ఉందా  అని అడుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో మందులు వాడినా ఫలితం ఉంటుందని మందులు వాడమని వెంట పడుతున్నా కదా.. ఇప్పుడు టెక్కు కూడా మోడల్ అయ్యింది. దానికి తోడు మీ కోడలికి టెక్కు కూడా ఉంది కదా అందుకని మందులు వాడనంటోంది అంటాడు కార్తీక్. మరి ఇప్పుడు ఒప్పించి వచ్చావా అని ఆత్రంగా అడుగుతుంది. లేదు మమ్మి.. అది ఎక్కడ ఒప్పుకుంటుంది.. నీ సహవాస దోషం కదా సహనానికి హద్దులు చూపిస్తుంది నాకు గానీ తిక్కరేగితే. కాళ్ళు చేతులు విరగొట్టి ఆస్పత్రిలో అన్నిటికి కలిపి వైద్యం చేయిస్తా అని చెబుతాడు తల్లితో.. మరి ఏమి చేశావురా ఉత్తి చేతులతో తిరిగి వచ్చావు.. కాళ్ళు చేతులు పట్టుకుని రాకపోయావా అంటుంది సౌందర్య.. ఆఖరి అవకాశం ఇచ్చి వచ్చా.. పిల్లలకు నా తప్పు లేదని.. వాళ్ళని మందులు వేసుకోవడానికి ఒప్పించమని చెప్పి వచ్చా అంటాడు కార్తీక్. దీంతో సౌందర్య మంచి తెలివైన వాడివిరా నువ్వు.. అంటుంది.. కాదు తెలివైన డాక్టర్ ని అంటాడు కార్తీక్. మూర్ఖుడినైన కొడుకుని .. కొంచెం లోతుగా ఆలోచిస్తే నాలోనూ మనిషి కనిపిస్తాడు మమ్మి అంటాడు కార్తీక్..

మరోవైపు దీప రూమ్ లో దీప పక్కన కూర్చున్న పిల్లలతో నేను ఎందుకు టాబ్లెట్స్ వాడడం లేదో మీకు తర్వాత చెబుతా అంటుంది దీప. కానీ ఈలోపు మీరు ఒక పనిచేయాలి అంటుంది.. ఏమిటమ్మా అంటారు పిల్లలు.. వారికీ ఎదో చెప్పి నవ్విస్తుంది.. తర్వాత ఇద్దరూ ఏడుస్తూ గది నుంచి తండ్రి దగ్గరకు బయలుదేరతారు. నాకు కళ్ళల్లో నీరు రావడం లేదు.. న కళ్ళు తుడిచినట్లు నువ్వు చెయ్యి.. నీ కళ్ళు తుడిచినట్లు నేను చేస్తానని ఇద్దరూ అనుకుంటూ.. తండ్రి దగ్గరకు వచ్చి అమ్మ తిట్టింది.. ఎందుకు అంటే.. మీరు కాదు కదా మీరు కాదుకదా మీ తాతలు దిగి వచ్చినా మందులు వేసుకోను అని చెప్పింది.. సౌందర్య.. వామ్మో అన్నన్ని మాటలు అందా.. అయితే ఇక మీ అమ్మతో మందులను ఆ దేవుడి కూడా వేయించలేడు అంటుంది.

దీప పిల్లల్ని అడ్డు పెట్టుకుని నాతొ మందులు వేయించాలని అనుకున్నాడు.. నేను ఏమైనా తక్కువ తిన్నానా.. ఆయన ప్లాన్ ని ఆయనకే తిప్పి కొట్టేస్తా అనుకుంటుంది. లాగి లెంపకాయ కొడతారా.. పిల్లల్ని ఎందుకు ఏడిపించవని తిడతా..  ఇంకా రాడేమిటి.. నన్ను హాస్పటల్ కి తీసుకుని వెళ్లాడా అని ఆలోచిస్తుంది దీప.. ఇక మరోవైపు కార్తీక్. .ఇవాళ దానిని హాస్పటల్ కి తీసుకుని వెళ్లకపోతే.. నాపేరు మార్చుకుంటా.. ఇంకో పేరు సెలెక్ట్ చేసి పెట్టుకో మమ్మి అంటాడు.. దీంతో సౌందర్య ఊ అంటూ అంగీకరిస్తుంది.. పిల్లలని రండిరా అంటూ దీప దగ్గరకు తీస్కుని వెళ్తాడు..

అందరూ తనదగ్గరకు రావడం చూసిన దీప… పుస్తకం చదువుతున్నట్లు యాక్ట్ చేస్తుంది. కార్తీక్ రూమ్ లోకి వచ్చి .. ఏమిటి మెంటల్ ఎక్కిందా .. పిల్లలని ఎందుకు ఏడిపించావు.. అని ప్రశ్నిస్తాడు.. మరి మీరు నన్ను పిల్లల దగ్గర ఎందుకు ఇరికించారు అని అంటుంది దీప. నీ మంచి కోసమే చెప్పా.. నాకు ఏది మంచిదో అది నాకు తెలుసు మీకు తెలుసు.. నీకు ఎలా చెబితే అర్ధం అవుతుంది. అంటాడు ,మీకు ఎలా చెప్పినా అర్ధం కాదని నాకు అర్ధమైంది అంటుంది దీప.. నేను ఒకరితో చెప్పించుకునే మూర్కుడిని కాను అంటాడు.. నేను కూడా ఒకరితో చెప్పించుకునేటంత మూర్ఖత్వంతో లేను అంటుంది దీప. వీరిద్దరి మధ్య వాదనని విన్న సౌందర్య, పిల్లలు నవ్వుకుంటారు. నీకు అప్పుడప్పుడు మెదడులో పురుగు తొలుస్తుందా.. కార్తీక్ అంటే.. ఏమో నేను ఎప్పుడు స్కాన్ చేయించుకోలేదు అంటుంది దీప.. ఇంతలో నవ్వుతున్న అమ్మని చూసి.. నీకు నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావు కదు ..

అంటే నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావా అంటే.. రామ రామ నా మీద ఒట్టు నాకు ఏమి తెలియదు అంటుంది సౌందర్య. నేను ఏ ట్రైనింగ్ కోచింగ్లు ఇవ్వడం లేదు అంటే.. మధ్యలో మా అత్తయ్యగారిని ఎందుకు లాగుతారు.. అంటుంది దీప.. సరే నీతో కొంచెం మాట్లాడాలి.. బయటకి రా అంటాడు కార్తీక్.. ఎక్కడికి ఎం మాట్లాడాలి అంటుంది దీప.. ఎం చెబితేనేగాని రావా అంటే.. మా అత్తయ్యగారి కోడలిగా తీసుకొచ్చారు కదా.. నేను ఆవిడ పర్మిషన్ లేకుండా రాను అంటుంది దీప ..

మేడం మీ కోడల్ని కాసేపు నాతో పంపిస్తావా అని అంటే.. సౌండ్ చాలా దరిద్రంగా ఉంది సుపుత్ర.. నా భార్యని కాసేపు బయటకి తీసుకుని వెళ్తాను అనలేవా అంటుంది. సౌందర్య.. దాన్నే పంపిస్తావా లేదా.. ఎప్పుడు ఎక్కడి అని ప్రశ్నిస్తే.. నాకోడలు కదా మరి. నమ్మి నీతో పంపించాలంటే డిటైల్స్ కావాలి అంటూ.. దీప నా కోడలు నీతో ఎదో మాట్లాడాలి అంట. వెళ్తావా అని ఆడుతుంటే.. ఆసుపత్రికి ఐతే తాడు కట్టి లాక్కెళ్లిన రానని చెప్పండి అంటుంది దీప. నువ్వు కాదు నేను ఆసుపత్రిలో చేరిపోయేలా ఉన్నాను.. వెధవ జీవితం ఆటలు అయిపోయింది అందరికీ అంటుంటే.. రా అని అడుగుతాడు. దీప వెళ్తూ.. వస్తాను అత్తయ్య అని వెళ్తుంది.
అసలు అమ్మ ఎం మాట్లాడింది.. నాన్న ఎం మాట్లాడాడు.. నాన్నమ్మ ఎందుకు నవ్వుతుంది అనుకుంటారు హిమ శౌర్య.. వాళ్ళని దగ్గరిని తీసుకుని ముద్దు పెట్టుకుని తనకు సంతోషం ఎందుకొచ్చింది చెబుతుంది. ఇద్దరూ కలిసి వెళ్తుంటే సంతోషంగా ఉందని అనుకుంటారు.. ఇక మోనిత రెడీ అవుతుంటే ప్రియమణి.. ప్రశ్నిస్తూ.. ఎక్కడికి బయలుదేరారు.. అని అడుగుతుంటే.. నేను చెప్పను.. చెబితే పనిజరగడం లేదు.. నల్లబట్టలు వేసుకుని వెళ్తున్నారు అంటే. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు తీసెయ్యి అంటుంది.. నవ్వుతూ మోనిత బయలుదేరుతుంది..

దీపని తీసుకొచ్చిన కార్తీక్.. కారునుంచి దిగమని చెప్పి.. ట్రీట్మెంట్ తీసుకొని భార్యని చంపిన భర్త అని వార్త వస్తుందని అనుకుంటున్నావా.. నీ దయ వలన నాకు ఇంకా అంత మూర్ఖత్వం అలవాటు లేదు లే అంటూ కారులో నుంచి దీపని దిగమని అంటాడు. దీపని ఒక తోటలోకి తీసుకొచ్చిన కార్తీక్.. దీప చేతులు పట్టుకుని నిన్ను ఎలా అడగాలో నాకు తెలియడం లేదు.. ఎలా ఒప్పించాలో తెలియడం లేదు.. ట్రీట్మెంట్ చేయించుకో దీప అంటాడు. నాకుఉన్న జబ్బుకి నేను బతకమని డాక్టర్లు చెప్పారా డాక్టర్ బాబు. అంటుంది.. ఛీఛీ అటువంటి ఏమీ లేదు అంటే.. నాకు సీరియస్ జబ్బా ఏమీ కానప్పుడు ఇంత బతిమాల్సిన అవసరం ఏముంది డాక్టర్ బాబు అంటే.. నువ్వు అంత లాజిక్ లు మాట్లాడకు.. నాకు అసలే మంటగా ఉంది.. అంటాడు.. రేపటి ఎపిసోడ్ లో దీప చెంపమీద కొట్టి… ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.. మరి ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి..

Also Read: రోహిత్ శర్మపై స్విగ్గి వివాదాస్పద పోస్ట్.. యాప్‌ని డిలీట్ చేయమంటున్న ఫ్యాన్స్