పదవవారం నామినేషన్స్ పరమచెత్తగా సాగాయి అన్న సంగతి తెలిసిందే. నలుగురు అమ్మాయిలు రాజమాతలు చేసి మీకు నచ్చినట్లు నామినేట్ చేసేయండి అంటూ ఆర్డర్ ఇచ్చేశాడు బిగ్‌బాస్. ఇంకేముంది తమకు నచ్చనివారిని మాత్రమే ఈ రాజమాతలు నామినేట్ చేశారు. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి ప్రవర్తన ఇంటి సభ్యులకు.. ఇటు ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పించింది. వీళ్లు నిజంగానే ఓ రాజ్యానికి రాజమాతలు అన్నట్లుగా బిహేవ్ చేశారు. మొత్తానికి ఈ వారం రతిక, శివాజీ, భోళే, యావర్, గౌతమ్ నామినేట్ కాగా.. సీరియల్ బ్యాచ్ మొత్తం సేవ్ అయ్యింది. ముఖ్యంగా యావర్ విషయంలో శోభా తన ఇష్టానుసారం చేసేసింది. వేరేవాళ్లను నామినేట్ చేయడానికి తన దగ్గర రీజన్ లేదు అని చెప్పినందుకు నేరుగా అతడినే నామినేట్ చేసింది శోభా. అలాగే రతికను సైతం నామినేట్ చేసి పారేసింది. ఇక రాజమాత ప్రియాంకను పూనింది. కళ్లెర్రజేసి అశ్వినిపైకి దూసుకొచ్చింది. మొత్తానికి అశ్వినితో కాళ్లు పట్టించుకున్నారు ఈ ఇద్దరు సీరియల్ క్విన్స్.
అయితే అదే ఎపిసోడ్లో మరో ఘటన జరిగింది. కానీ ఆ ఫుటేజ్ మెయిన్ ఎపిసోడ్లో కనిపించలేదు. అదెంటంటే.. అందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను క్షమించాలని అడగాలంటూ రాజమాతగా ఆర్డర్ వేసింది శోభా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. శోభా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్. నామినేషన్స్ మధ్యలో ప్రశాంత్ మాట్లాడుతున్నాడని శోభా ఏం చేసిందంటే.. ‘ఏయ్ ఇటు రా.. నామినేషన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతున్నావ్ ఏంటీ ?. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి.. క్షమించమని చెప్పు’ అంటూ నిజంగానే మహరాణిలా ఫీల్ అయిపోయింది. ఇక ప్రియాంక అక్కా పక్కనే ఉండి నవ్వుతూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రశాంత్ స్థానంలో అమర్ ఉండి పెద్ద యుద్ధమే చేసేది ప్రియాంక. కానీ అక్కడ ప్రశాంత్ ఉండడంతో ముసి ముసిగా నవ్వుతూ తెగ ఎంజాయ్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ప్రశాంత్ తో శోభా ప్రవర్తన చూసి ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ముందు ఆ శోభను ఎలిమినేట్ చేయండి బ్రో.. వరస్ట్ నామినేషన్స్.. శోభాకు అహంకారం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్. ముందు నుంచి హౌస్ లో శోభా తన వింత ప్రవర్తనతో చిరాకు తెప్పిస్తోంది సోభా. మొన్నటి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో శోభా రియాక్షన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సైడ్ నుంచి అమర్ ఆపుతున్నప్పటికీ పెద్ద పెద్దగా అరుస్తూ నానా రచ్చ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.