ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వేలం పాట అయిపోతుంది. అనామికతో చేతులు కలిపిందని రుద్రాణి కావ్యని నిందిస్తుంది. ఎవరు ఎవరితో చేతులు కలిపారో కాసేపట్లో తెలుస్తుందని కావ్య సంతోషంగా ఉంటుంది. అప్పుడే సామంత్ వచ్చి.. వేలం అయిపోలేదు కదా.. అని అంటాడు. నువ్వే లేట్ వేలం పాట అయిపోయింది.. మనమే విజయం సాధించాం. రూ.40 కోట్లకు ఆ అరవింద్ కంపెనీని కొన్నామని అనామిక అనగానే.. సామంత్ సీరియస్ అవుతూ.. నన్ను నిలువునా ముంచేశావ్ అనామిక.. ఐదారు కోట్లు పెట్టినా ఎక్కువే. అసలే బ్యాంక్‌లో పది కోట్ల దాకా అప్పు ఉంది. ఇప్పుడు మనకు రూ.35 కోట్ల నష్టం అని అనామికను తిడతాడు సామంత్. అప్పుడే కావ్య మాట్లాడుతూ.. సామంత్ ఎంత నష్టం రూ.35 కోట్లు.. దటీజ్ కావ్య అని అంటుంది. అప్పుడే అరవింద్ వచ్చి.. థాంక్యూ మేడమ్ మీరు వచ్చి వేలం పాట పెంచకపోయి ఉంటే.. ఐదు కోట్లకు మించి ఎవరూ కొనే వారే కాదు. మనం అనుకున్నట్టుగా రూ.15 కోట్ల లాభం మీకు.. రూ.15 కోట్ల లాభం నాకు.. ఇదిగోండి చెక్ అని అరవింద్ చెక్ ఇచ్చి ఎంతో సంతోషంగా వెళ్తాడు.
ఎవరి వేలితో వారి కన్నే పొడవడం అంటే ఇదే అనామిక.. నువ్వు నన్ను మోసం చేసి నీ కంపెనీకి అవార్డు వచ్చేలా చేశావు. నేను నీ తెలివి తక్కువ తనాన్ని వాడుకుని.. కోట్ల నష్టం వచ్చేలా చేశాను. నాకు కోట్ల లాభం వచ్చిందని కావ్య అంటుంది. ఇందకా రుద్రాణి ఏదో వాగింది. ఇప్పుడెందుకు గమ్ రాసినట్టు నోరు మూత పడింది. ఏమే అనామకురాలా.. ఇప్పుడు అర్థమైందా? మేము ఓడిపోయినా లాభమే పొందాం.. నీ పతనం మొదలైపోయిందని కనకం అంటుంది. ఆ.. రుద్రాణి గారు ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ తీయించుకోండి.. మీ గుండె ఆగిపోయిందని కావ్య అంటుంది. రుద్రాణి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇక రాజ్ సీరియస్‌గా చూసి వెళ్లిపోతూ ఉంటే.. కావ్య రాజ్ వెనుక వెళ్తుంది. సామంత్ వీళ్లందర్నీ షూట్ చేసి పారేయాలని అనామిక అంటే.. మరి నేను నిన్ను ఏం చేయాలి? అని సామంత్ సీరియస్‌గా అంటాడు. దీన్ని నువ్వేం చేయకు.. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుని వదిలి పెట్టమని.. లేదంటే నడి రోడ్డుమీద నిలబడాల్సి ఉంటుంది. ఏదో కూత కూశావ్.. నాలుక కోసి పారేస్తా.. నీకూ దానికి తేడా ఏముందే.. ఛీ అంటూ రుద్రాణికి, అనామికకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది కనకం.
ఎవరో ఏంటో ఎందుకో ఎలాగో.. నన్ను నమ్మలేదు. ఇప్పుడన్నా నేను నిన్ను నమ్ముతానా ఆ తల్లి బుద్ధులే నీకూ వచ్చాయి. ఎలాగైనా ఎదుటి వాళ్లను మోసం చేయాలని ఇలా చేశావు? ఇది కూడా ఒక గెలుపేనా? సొంత తెలివి తేటలతో పైకి రావాలని రాజ్ అంటాడు. అయ్యయ్యో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు ఆలోచించాలి. ఒకప్పుడు మీరే నాకు హిత బోధ చేశారని.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తారు.. అక్కడ రాజ్ తన తెలివితో.. ఎదుటి కంపెనీని మోసం చేస్తాడు. మన తెలివితో ఎదుటి వాళ్లను దెబ్బ కొట్టాలి. ఇది చాణక్య నీతి.. అని అంటాడు. గుర్తొచ్చిందా.. చాణక్య నీతి అని చెప్పారు కదా.. ఇవన్నీ చెప్పింది ఎవరు? మీ బాటలోనే నడిచానని కావ్య అంటే.. లంచ్‌కి టైమ్ అయిందని రాజ్ వెళ్లిపోతాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. రాజ్ ఆగు ఆగు.. అంటూ పిలుస్తుంది. అయినా పట్టించుకోకుండా రాజ్ వెళ్తాడు.
పాపం ఒంటరిగా మిగిలిపోయినట్టు ఉన్నారు.. ఎదుటి వాళ్లను మోసం చేయాలని చూస్తే ఇలాగే ఒంటరిగా ఉంటారని కావ్య అంటుంది. నా కంటే మీ అమ్మ తక్కువనా క్యాన్సర్ నాటకం ఆడిందని రుద్రాణి అంటే.. మా అమ్మ విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి నాటకం ఆడింది.. మీలా విడగొట్టేందుకు కాదు.. చాలా తేడా ఉందని కావ్య అంటుంది. అప్పుడే పెద్దావిడ కావ్యకి ఫోన్ చేస్తుంది. మీ అత్తగారి పద్దతి ఏమీ బాలేదు. రోజు రోజుకూ మీ మావయ్యతో దూరం పెంచుకుంటుంది కానీ కలిసి పోవడం లేదని జరిగింది చెబుతుంది ఇందిరా దేవి. మీరు కంగారు పడకండి నేను చూసుకుంటానని అపర్ణతో మాట్లాడుతుంది కావ్య. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నిన్ను మోసం చేసిన ఆ అనామికను దెబ్బకొట్టి.. నిజమైన వుమెన్ బిజినెసర్‌లా ఆలోచించావు అని అంటుంది అపర్ణ. మీరు చేస్తున్న పని వల్ల కూడా ఇంట్లో అందరూ బాధ పడుతున్నారు. మావయ్య విషయంలో మీరు చేస్తుంది తప్పని కావ్య అంటుంది. నువ్వు గెలిచిన సంతోషాన్ని పంచుకోవడానికి నన్ను పిలిచావు అనుకున్నా.. కానీ మీ అమ్మమ్మ చెబితే వచ్చావని తెలిసిందని అపర్ణ అంటుంది.
భార్య ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం తప్పు కదా.. అని అపర్ణ నిలదీస్తుంది. అది ముమ్మాటికే తప్పు అత్తయ్యా.. జీవితంలో ప్రతీ మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి. మావయ్యకు మీరు అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఆయన్ని క్షమించి చూడండి.. మళ్లీ మీరు కోరుకున్న జీవితం మీకు దగ్గర అవుతుందని కావ్య అంటే.. నన్ను క్షమించమని అడుగుతున్నావు? మరి నువ్వు నా కొడుకుని క్షమించగలవా అని అపర్ణ అడుగుతుంది. అత్తయ్యా ఆయన్ని ఎప్పుడో క్షమించేశాను.. మేమిద్దరం మళ్లీ కలుస్తామని ఆశ.. ఆయన లోపం మూర్ఖత్వం.. ఆయనలో ఉన్న ప్రేమను బయటకు తీసుకు రావడానికి ఆఫీసుకు వచ్చాను. నాకు ఎలాంటి అనుభవం లేని నేనే నా భర్తని క్షమించినప్పుడు.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మావయ్యని మీరెందుకు క్షమించలేరు అత్తయ్యా.. ఒక్కసారి మీ కోపాన్ని దాటి వచ్చి చూడండి. మీ అబ్బాయి గారిలో మార్పు రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు మారి.. ఆయనకు తెలిసేలా చేస్తేనే కదా ఆయనలో మార్పు వస్తుందని తెలిస్తేనే కదా అని కావ్య చెబుతుంది.
కట్ చేస్తే.. సూప్ తాగమని ఇంట్లో వాళ్లు చెబితే తాగడు. అపర్ణ ఇంటికి వచ్చి.. మా ఆయన ఏం అంటున్నారా? అని అంటుంది. ఇదిగో సూప్ తాగండి.. వేడి చల్లారుతుంది.. తాగమని అపర్ణ అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. అపర్ణా నాతో మాట్లాడుతున్నావా అని సుభాష్ అంటే.. ఎంత ఉరకలేసినా నదులన్నీ వెళ్లి సముద్రంలో కలవాల్సిందే.. ఎన్ని అపార్థాలు వచ్చినా భార్యభర్తలు ఒకటి కావాల్సిందే అని అపర్న అంటుంది. నువ్వు నన్ను క్షమించావా అని సుభాష్ అడిగితే.. మీరు చేసిన తప్పు వల్ల దూరంగా ఉన్నాను. ఎన్ని సార్లు క్షమాపణ అడిగినా పట్టించుకోలేదు. ఈ రోజు నుంచి మన మధ్య ఎలాంటి సమస్యలు రావులే అని అపర్ణ అంటుంది. అది చూసి ఇంట్లోని వాళ్లందరూ సంతోషిస్తారు.
చూశావా రాజ్ ఇన్ని రోజుల్లో వారి మధ్య ఉండే దూరాన్ని ఎవరూ తగ్గించలేక పోయారు. కానీ మీ అమ్మ మనసు మార్చి.. మీ నాన్నాకు దగ్గర అయ్యేలా చేసింది కావ్యే అని ఇందిరా దేవి అంటే.. ఓహో ఇదంతా ఆ కళావతి మాయాజాలమా.. ఆ క్యాన్సర్ కనకం కూతురు కూడా మాయలు మంత్రాలు బాగానే నేర్చుకుని బాగానే ప్రయత్నిస్తుందని రాజ్ అంటే.. ఛీ నీకు అలా అర్థమైందా.. నీ మొదడును వాషింగ్ మెషీన్‌లో వేసి ఉతికినా మారదని పెద్దావిడ తిడుతుంది. ఆ కావ్య గురించి ఏమో అనుకున్నా కానీ బయట ఉన్నా కూడా కావ్య అన్నీ బాగానే చేస్తుందంటూ రాహుల్, రుద్రాణిలు ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. అప్పుడే స్వప్న అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి అంటూ సాంగ్ ప్లే చేస్తుంది. దీంతో రుద్రాణి సీరియస్ అవుతూ బయటకు పో అని అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేలా చేసిందే నేను అని స్వప్న అంటే రుద్రాణి షాక్ అవుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..