Brahmamudi, June 27th Episode: అనుకున్నట్టే ఆగిపోయిన శోభనం.. అనామికను లాగిపెట్టి కొట్టిన అత్త!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మొత్తం మీద ఇంట్లోవాళ్లు ఎంతో ప్లాన్ చేసి.. రాజ్, కావ్యలు శోభనం గదికి పంపిస్తారు. రాజ్, కావ్యలు ఏదో తేడాగా ఉందే అనుకుంటూ గదికి చేరుకుంటారు. లోపల చీకటిగా ఉండటంతో లైట్ వేస్తారు. అక్కడ ఉన్న శోభనం గది డెకరేషన్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు అర్థమైంది.. అందరూ ఈ గదిలోనే అన్నీ మర్చిపోయామని రాజ్ అంటే.. అందుకా.. నన్ను ఈ గదిలోకి రానివ్వలేదా? అని కావ్య, అందుకేనా నాన్నమ్మ..

Brahmamudi, June 27th Episode: అనుకున్నట్టే ఆగిపోయిన శోభనం.. అనామికను లాగిపెట్టి కొట్టిన అత్త!
Brahmamudi
Follow us

|

Updated on: Jun 27, 2024 | 12:56 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మొత్తం మీద ఇంట్లోవాళ్లు ఎంతో ప్లాన్ చేసి.. రాజ్, కావ్యలు శోభనం గదికి పంపిస్తారు. రాజ్, కావ్యలు ఏదో తేడాగా ఉందే అనుకుంటూ గదికి చేరుకుంటారు. లోపల చీకటిగా ఉండటంతో లైట్ వేస్తారు. అక్కడ ఉన్న శోభనం గది డెకరేషన్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు అర్థమైంది.. అందరూ ఈ గదిలోనే అన్నీ మర్చిపోయామని రాజ్ అంటే.. అందుకా.. నన్ను ఈ గదిలోకి రానివ్వలేదా? అని కావ్య, అందుకేనా నాన్నమ్మ, తాతయ్యలు మన గదికి వెళ్లారు అని రాజ్ అంటాడు. ఇందులో అత్తయ్య గారి హస్తం కూడా ఉందండోయ్.. అగరత్తులు తీసుకు రావడం చూశాను అని కావ్య చెబుతుంది. ఇక ఇద్దరూ ఆహా ఏం నాటకం ఆడుతున్నారు.. అని ఇద్దరూ అనుకుంటారు. వాళ్లతో చెప్పి నువ్వే ఈ గది రెడీ చేయించావ్ అని రాజ్ అంటే.. నేను సిగ్గు విడిచి మాకు శోభనం చేయించమని నేను అడుగుతానా? అని కావ్య అరుస్తుంది.

రాజ్, కావ్యల యుద్ధం..

మరి నేను చేయించానా? అని రాజ్ అంటాడు. అవును మీరే ఈ గూడు పుటానీలో మీకే భాగం ఉందని.. కావ్య, రాజ్‌లు ఇద్దరూ గొడవ పడుతూ.. అరుస్తూ ఉంటారు. దీంతో కావ్య ఓ మూలకు వెళ్లి యాపిల్ తింటూ ఉంటుంది. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. రేయ్ ఎవరు ఆరేంజ్ చేస్తే ఏంటిరా దద్దమ్మా… నీకు కావాల్సిందే జరుగుతుంది. నువ్వు ఎలాగో ఈ రోజు నీ మనసులో మాట కళావతితో చెప్పేస్తాను అన్నావ్ కదా.. ఇంతకు మంచి టైమ్ నీకు దొరకదు.. శోభనం కానిచ్చేయ్ రా.. అయినా రాజ్ ఇగో అడ్డం పడుతుంది. పూల పక్క చూస్తే.. మనసు అంతా ఏదో తికమక పెడుతుందిరా.. ఈ జన్మకు ఇది చాలు వెళ్లరా.. చెప్పేయమని రాజ్ అంతరాత్మ గోల పెడుతుంది. మరీ అంత బలవంతం పెట్టకు అని రాజ్ అరుస్తాడు. దీంతో కావ్య వచ్చి నేనా నేను మిమ్మల్ని బలవంతం పెట్టానా అని కావ్య అరుస్తుంది.

చివరిదాకా వచ్చి ఆగిపోయిన శోభనం..

అంటే అన్నారు.. అరేంజ్ చేయిస్తే చేయించారు. పూల పక్కా.. మీ పక్కన నేను.. పాలు కావాలా? పండు కావాలా? పోనీ స్వీట్ కావాలా? అని కావ్య ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటే.. ఏమీ వద్దని రాజ్ అంటాడు. మరేం కావాలి అని కావ్య స్వీట్‌గా అడుగుతుంది. నువ్వే కావాలి అని రాజ్ చెప్తాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. నీతో మాట్లాడాలి.. చాలా మాటలు చెప్పాలి. కాస్త నేను చెప్పేది వినవే అని రాజ్ అంటాడు. సరే చెప్పండి.. అదీ నేను అని సాగదీస్తాడు రాజ్. నా కళ్లలోకి చూస్తూ చెప్పమని కావ్య అంటుంది. రాజ్ దగ్గరగా వెళ్తూ కావ్యని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అనామికా.. అని కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు. దీంతో ఏం జరిగిందా అని రాజ్, కావ్యలు బయటకు వెళ్తాడు. అబ్బా జరగదు రా.. ఈ జన్మలో మీ శోభనం జరగదని అంతరాత్మ ఏడుస్తుంది.

ఇవి కూడా చదవండి

బీభత్సం సృష్టించిన కళ్యాణ్..

కళ్యాణ్ అరుపులకు ఇంట్లోని వాళ్లందరూ బయటకు వస్తారు. అనామిక మెల్లగా ఏమీ జరగనట్టు వస్తుంది. రా నీ కోసమే ఎదురు చూస్తున్నా అని కళ్యాణ్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి నేను ఏదో పెద్ద నేరం చేసినట్టు పిలుస్తున్నావ్ అని అనామిక అంటుంది. నువ్వెందుకు భయ పడతావు? నువ్వు ఎవర్ని చూసి బెదిరిపోతావ్? నువ్వు ఒక ఆడదానివి అయితే.. భర్త అంటే గౌరవం ఉండేది. భార్య అంటే ఎలా ఉండాలో తెలిసేదని కళ్యాణ్ అంటే.. ఏంటి నీ పంచాయితీ ఇప్పుడు అని పొగరుగా మాట్లాడుతుంది అనామిక. ఇవిగో అని డైవర్స్ పేపర్స్ విసిరేస్తాడు కళ్యాణ్. ఏంట్రా అవి అని రాజ్ అడిగితే.. డైవర్స్ పేపర్స్ అని కళ్యాణ్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి విడాకులు కోరుతున్నా..

ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి విడాకులు కోరుతున్నా అని కళ్యాణ్ అంటాడు. నువ్వు తప్పు చేసి.. అప్పూతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి.. రివర్స్‌లో నన్ను విడాకులు అడుగుతున్నావ్? ఏంటి? నేను పోతే ఆ అప్పూని ఇంటికి తెచ్చుకుందమనా అని అనామిక అంటే.. కళ్యాణ్ కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఆ తప్పు చేసానా.. అది తప్పులా కనిపించేలా నువ్వు క్రియేట్ చేశావని అంటాడు. అయినా తగ్గదు అనామిక. నా దగ్గర సాక్ష్యం ఉందని.. సీసీ కెమరాలో రికార్డ్ అయిన వీడియో చూపిస్తాడు కళ్యాణ్. అయినా అనామిక కొట్టి పారేస్తుంది. దీంతో ఆ నెక్ట్స్ అప్పూ, కళ్యాణ్‌లు ఉన్న గదికి లాక్ పెట్టిన అతన్ని తీసుకొస్తాడు కళ్యాణ్. అవును సర్ ఇదంతా మేడమే చేయించారని చెప్తాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు.

రాక్షసిని.. లాగి పెట్టి కొట్టిన ధాన్య లక్ష్మి..

ఇక కోపంగా ఊగిపోయిన ధాన్య లక్ష్మి.. ఛీ నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదని లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. రాక్షసి.. అస్సలు నువ్వు మనిషివేనా? ఇప్పటి దాకా నువ్వు ఎన్ని తప్పులు చేసినా బయట పెట్టకుండా ఊరుకున్నా. దొంగతనంగా రూ.10 లక్షల చెక్కును నీ పుట్టింటికి పంపాలి అనకున్నా.. బయట పెట్టలేదు. నా కొడుకుతో ప్రతి రోజూ గొడవ పడుతున్నా.. నాలుగు రోజులు పోతే సర్దుకు పోతారని ఊరుకున్నా.. నీ కోసం.. నా కొడుకుని కూడా మందలించాను అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ధాన్య లక్ష్మి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో