చిలకడదుంప తినండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

TV9 Telugu

29 June 2024

చిలకడదుంప తింటానికి ఎంతో రుచిగా ఉంటుంది.. అంతేకాకుండా దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చిలకడదుంపలలో విటమిన్ ఎ, సి, బి6 వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

ముఖ్యంగా చిలకడదుంపలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంచి మలబద్ధక సమస్యను నివారించడానికి మంచిగా సహాయపడుతుంది.  

చిలకడదుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచి అనేక రకాల కంటి సమస్యలను నివారించడంలో  సహాయపడుతుంది. 

చిలకడదుంపలలో పొటాషియం అనే ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

చిలకడదుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహంతో బాధపడుతున్నవారికి చిలకడదుంపలు మంచి ఆహార ఎంపిక.  

చిలకడదుంపలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మంచిది. ముడతలు, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది.