ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో మా అక్క కోసం నేను మౌనంగా ఉన్నాను అంతే కానీ నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదని కావ్య అంటే.. నీ మౌనం ఖరీదు ఈ ఇంట్లో వాళ్లందరీ సంతోషం. దాన్ని దూరం చేశావని రాజ్ అంటాడు. ఏవండీ తాతయ్య.. ఆరోగ్య పరిస్థితి గురించి నాకు నిజంగా తెలీదని కావ్య అంటే.. నాటకాన్ని ఇంకా బాగా ఆడేదానివి కదా. మీ అక్కతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో వాళ్లను, నన్ను ఎలా మోసం చేయాలా అని ప్లాన్ చేసేదానివి కదా అని రాజ్ అంటాడు. మళ్లీ కావ్య చెప్పాలని చూస్తున్నా.. రాజ్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా.. నీ కోసం మా అమ్మనే ఎదిరించాను. నా భార్య అబద్ధం మాత్రం చెప్పదని గర్వపడ్డా.. కానీ ఇలా చేస్తావని అనుకోలేదని రాజ్ అంటాడు.
సీతా రామయ్య కోసం ఇందిరా దేవి గాబరా:
ఇక ఉదయాన్నే హాలులో అందరూ మనౌంగా కూర్చుంటారు. ఈలోపు కావ్య టీ పెట్టి తీసుకొచ్చి ఇస్తుంది. కానీ ఎవరూ తీసుకోరు. అయితే స్వప్న కాఫీ అడుగుతుంది. కానీ కావ్య ఇప్పుడు వద్దు అని సైగ చేస్తున్నట్లు చెబుతుంది. ఈలోపు ఇందిరా దేవి వచ్చి ఆస్తి పేపర్స్ అన్నీ బయట పెడుతుంది. రేయ్.. నేను సుమంగళిగానే పోవాలి అనుకుంటున్నా. పుణ్య స్త్రీగా ప్రాణాలు విడవాలంటే.. బావని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దురదృష్టాన్ని తలుచుకుని కుమిలి పోవడం కాదు. దు:ఖాన్ని దిగమింగుకుని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. అందుకు నా వయసు సహకరించడం లేదు. పెళ్లై ఎన్నేళ్లు అయినప్పటికీ నేను భర్త చాటు భార్యగా ఉండటం వల్ల బయట ప్రపంచం నాకు తెలీదు. మీరు ఎదిగిన వారు.. అన్నీ ఎరిగిన వారు నా భర్త ప్రాణాల్ని నాకు దానం చేయండి అని కొంగు చాచి అడుగుతుంది ఇందిరా దేవి. దీంతో అందరూ బాధ పడతారు.
ఆస్తి కరగబెట్టినా నాన్న ప్రాణాలు నిలుస్తాయా అన్న రుద్రాణి.. చెంప పగలకొట్టిన ఇందిరా దేవి:
సరిగ్గా అదే టైమ్ లో కళ్యాణ్ కి అనామిక కాల్ చేస్తుంది. కానీ కాల్ కట్ చేస్తాడు కళ్యాణ్. కానీ మళ్లీ చేస్తుంది అనామిక. ఈ కుటుంబానికి మూల స్తంభం నా భర్త. ఆయనే లేక పోతే నాకు ఈ ప్రపంచం మాయం అయిపోతుందని ఇందిరా దేవి బాధ పడుతుంటే.. కావ్య, ధాన్యలక్ష్మి, అపర్ణ ఏం కాదని ధైర్యం చెబుతారు. నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదు.. పరిష్కారం. ఇదిగోండి నగలు, డబ్బు, ఆస్తి పేపర్స్ ఇవన్నీ తీసుకుని.. అమ్మేయండి. ఏ దేశంలో నా భర్త ప్రాణాలు నిలబెట్ట గలిగిన డాక్టర్లు ఉంటారో.. అక్కడికి తీసుకుని వెళ్లండి. ఎంత ఖర్చు అయినా భరించి ఆయన్ని కాపాడుకుందాం. అప్పుడే రుద్రాణి వచ్చి.. అమ్మా ఎంత ఖర్చు పెట్టినా ఆస్తి కరగడం తప్ప.. ప్రయోజనం ఏం ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశమే ఉంటే.. రాజ్, పెద్ద అన్నయ్య ఆ పని ఎప్పుడో చేసుండేవారు కదా అని అంటుంది. ఆ మాటలకు ఆవేశంతో ఊగిపోయి చంపదెబ్బ కొడుతుంది ఇందిరా దేవి. ఏమన్నావ్.. ఆస్తి కరిగి పోతుందా.. రోడ్డు మీద పడతామా.. ఇవన్నీ చేయడానికి నేను చేయమంది వ్యాపారం కాదు.. ఆయుష్షు పోయమంటున్నా. ఇది ఒక ప్రాణం. ఇన్నాళ్లూ మనందర్నీ కాపాడుకుంటూ వచ్చిన ఒక పెద్ద దిక్కుకు ఆపద వస్తే.. అనారోగ్యం చేస్తే.. చేతులు ముడుచుకుని కూర్చుంటామా అని ఇందిరా దేవి అంటే.. ఆ తర్వాత అపర్ణ కూడా చివాట్లు పెడుతుంది. నా బావ లేనినాడు ఈ చిట్టి కూడా ప్రాణాలతో ఉండదని గుర్తు పెట్టుకోండని ఇందిరా దేవి అంటుంది. అప్పుడే బయటకు వచ్చిన సీతా రాయ్య అదంతా వింటాడు.
ఇందిరా దేవిని ఓదార్చిన రాజ్:
నానమ్మా.. ఇంత పెద్ద కష్టం ఇంటికి వస్తే అందరూ ఏం చేయాలా అని కూర్చున్నారు. కానీ నువ్వు మాత్రమే కర్తవ్యం కోసం దు:ఖాన్ని దిగమింగుకున్నావ్. జరిగి పోయిన దాని గురించి కుంగిపోకుండా జరగాల్సిన దాని గురించి దృష్టి పెట్టమంటున్నావ్. ఈ కాలంలో ఎంత మందికి ఇంత ఆత్మ నిబ్బరం ఉంటుందో నాకు తెలీదు. కానీ నిన్ను చూస్తుంటే నీ మనవడిని అయినందుకు నాకు గర్వంగా ఉంది. తాతయ్య ప్రాణాల కోసం ఆస్తులే అవసరం అయితే సర్వస్వం ధార పోయడానికి ఇక్కడ అంతా సిద్ధంగా ఉన్నాం. ఎవరికీ ఏ స్వార్థం లేదు. తాతయ్య లేనిదే ఈ కుటుంబం.. మేము ఉండేవాళ్లం కాదు. ఇంతకు ముందు ఈ నిజం ఎవరికీ తెలీదు కాబట్టి.. రహస్యంగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఈ నిజం అందరికీ తెలిసి పోయింది కాబట్టి.. అందరికీ తెలిసేలాగే ఏర్పాట్లు జరుగుతాయని రాజ్ అంటాడు. అవును అమ్మా.. రాజ్ అందరి డాక్టర్స్ తో ఈ సమస్యతో మాట్లాడుతున్నాడు. అమెరికాలో చికిత్స చేస్తున్నారని తెలుసుకున్నాడు. ఆ డాక్టర్ రాగానే రిపోర్ట్స్ చూపించి.. చికిత్స చేయిస్తాం అని సుభాష్ అంటాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో నానమ్మ.. ఆ వృక్షం ఉంటేనే ఈ కొమ్మలు పచ్చగా ఉంటాయి. తాతయ్య ఉంటేనే ఈ కుటుంబం క్షేమంగా ఉంటుంది. తాతయ్యని పూర్తి ఆరోగ్యంతో అప్పగిస్తానని నీకు మాట ఇస్తున్నా అని రాజ్ అంటాడు.
దిగాలుగా పడుకున్న అప్పూ.. ఇంటికి వచ్చిన అనామిక:
ఈ సీన్ కట్ చేస్తే.. ఇదేంటక్కా ఇలా పడుకుంటుందని కనకం అంటే.. ఏంటే నువ్వు ఎప్పుడైనా దాన్ని ఆడపిల్లలా చూస్తేనే కదా. ఏం జరిగిందో తెలుసుకుని దాన్ని మనసును కనుక్కుంటేనే కదా.. కనకం అక్క అంటుంది. దాని మనసులో ఏం జరుగుతుంది. ప్రేమలో పడిందా అంటే.. అదీ అయి ఉండదు. అయినా మగరాయుడు కదా.. మనసులో పెట్టుకుని కుమిలిపోదు. కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడేస్తుంది. ఒంట్లో ఏమీ బాగోలేదేమో అని కనకం అంటుంది. ఈలోపు ఆంటీ అని అనామిక వస్తుంది. అప్పూ ఏంటి అలా పడుకున్నావ్.. అని అనామిక అంటే.. పనేం లేక అని అప్పూ సమాధానం ఇస్తుంది. ఒక్కదానివే వచ్చావా అని అప్పూ అడిగితే.. అవును కవి చాలా బిజీ కదా అని అని అనామిక అంటుంది. ఏ కలెక్టర్ గిరి ఏమైనా చేస్తున్నాడా.. అని అప్పూ అంటాడు. అప్పూ ఒకసారి ఫోన్ చేస్తావా అని అనామిక అడుగుతుంది. నేనా.. నేను చేస్తే ఏం మాట్లాడతాడు.. అని అప్పూ అంటే లేదు అని అనామిక కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన కళ్యాణ్.. హలో బ్రో అంటాడు. నేను అనామికని అంటుంది అనామిక. అనామికా.. నువ్వు ఎక్కడ ఉన్నావ్.. అని కళ్యాణ్ అడిగితే.. అప్పూ ఇంట్లో అని అనామిక చెబుతుంది.
అప్పూ ఫోన్ ని లిఫ్ట్ చేసిన కళ్యాణ్.. షాక్ లో అనామిక:
అప్పూ ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేశావ్.. నేను చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని అనామిక అంటుంది. ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదని కళ్యాణ్ అంటే.. ఇప్పుడేమన్నా బాగు పడ్డావా అని అనామిక అంటుంది. అప్పూకి ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది. కాల్ కట్ చేసినా పర్వాలేదు. కానీ నీతో ఎక్కువ సేపు మాట్లాడాలి కదా అని కళ్యాణ్ అంటే.. నేను అర్థం చేసుకోనా అని అనామిక అంటుంది. నిన్ను హార్ట్ చేసి ఉంటే సారీ అని కళ్యాణ్ చెప్తాడు. నిన్ను చూస్తుంటే నాకు జలసీగా ఉంటుంది. నీ ఫ్రెండ్ షిప్ కళ్యాణ్ చాలా వాల్యూ ఇస్తాడు. అప్పూ అంటే చాలా ఇష్టం కళ్యాణ్ బాబు కి అని అంటుంది కనకం.
ఆస్తి కోసం మరో ప్లాన్.. ఆస్తి పేపర్లతో పెద్దాయన గదిలోకి వచ్చిన రుద్రాణి:
ఆ తర్వాత సీతా రామయ్య దగ్గరకు వస్తుంది రుద్రాణి. నాన్నా అని పిలిచి.. మీ ఆరోగ్యం కోసం నేను ప్రతి క్షణం దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటున్నా. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్తుంది. నేను మాట్లాడుతూ ఉంటే.. నువ్వు పుస్తకం చదువుతూ ఉంటున్నావేంటి నాన్నా.. అని అడిగితే నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం రుద్రాణి అని సీతా రామయ్య అంటాడు.