Brahmamudi, September 25th episode: ఆనందంలో మునికి తేలుతున్న కావ్య.. స్వప్న చావుకి ముహుర్తం పెట్టిన రాహుల్..!

|

Sep 25, 2023 | 12:53 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. రాహుల్ కి నేను ఈ శారీలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది స్వప్న. నీకేంటి బేబి.. నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. ఏంటి ఈ శారీలో నీకు ఎలాంటి తేడా కనిపించడం లేదా.. మళ్లీ అడుగుతుంది స్వప్న. రాహుల్ సస్పెన్స్ ఇస్తూ.. నీకు ఏ దిష్టీ తగల కూడదు అంటూ మేనేజ్ చేస్తాడు. దీంతో స్వప్న హమయ్యా.. కడుపు పెరిగిన విషయం గుర్తు పట్టలేదు.. అంటూ లోలోపల ఆనంద పడుతుంది. దీంతో రాహుల్ కూడా మనసులో మాట్లాడుకుంటూ..

Brahmamudi, September 25th episode: ఆనందంలో మునికి తేలుతున్న కావ్య.. స్వప్న చావుకి ముహుర్తం పెట్టిన రాహుల్..!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. రాహుల్ కి నేను ఈ శారీలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది స్వప్న. నీకేంటి బేబి.. నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. ఏంటి ఈ శారీలో నీకు ఎలాంటి తేడా కనిపించడం లేదా.. మళ్లీ అడుగుతుంది స్వప్న. రాహుల్ సస్పెన్స్ ఇస్తూ.. నీకు ఏ దిష్టీ తగల కూడదు అంటూ మేనేజ్ చేస్తాడు. దీంతో స్వప్న హమయ్యా.. కడుపు పెరిగిన విషయం గుర్తు పట్టలేదు.. అంటూ లోలోపల ఆనంద పడుతుంది. దీంతో రాహుల్ కూడా మనసులో మాట్లాడుకుంటూ.. పిచ్చిది నేను దీన్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తుంటే.. రొమాన్స్ ఎలా చేయాలా అని అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న.. ఇంటికి వెళ్లిపోదాం అంటుంది. దీంతో రాహుల్ షాక్ అవుతాడు. రేపు వెళ్దాం అంటూ కన్విస్ చేస్తాడు. సరే అంటుంది స్వప్న.

అసలు నిజం చెప్పిన కావ్య.. షాక్ లో రుద్రాణి:

ఆ తర్వాత కావ్య, రాజ్ లు ఇంకా రాలేదని అపర్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది. దీంతో రుద్రాణి పుల్లలు పెడుతుంది. ఈ లోపు రాజ్, కావ్యలు వస్తారు. ఇక అపర్ణ ఎటాక్ స్టార్ట్ చేస్తుంది. కావ్య, రాజ్ లు జరిగింది చెప్పడానికి ట్రై చేస్తున్నా చెప్పనివ్వదు. ఆ నెక్ట్స్ రుద్రాణి తగులుకుంటుంది. ఇక సుభాష్ చాలు.. ఇప్పుడేమైంది అని ఇంత గొడవ చేస్తున్నారు అంటూ కేకలు వేస్తాడు. ఈ లోపు కావ్య.. విగ్రహాలు దొంగిలించికు వెళ్లారని చెప్పగా.. అందరూ షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం నవ్వుకుంటుంది. అప్పుడు రాజ్ సేవ్ చేసిన విషయం కూడా చెప్తుంది కావ్య. దీంతో అందరూ ఊపిరి పీల్చుకోగా.. అపర్ణ, రుద్రాణిలు మాత్రం షాక్ అవుతారు. మంచి పని చేశావ్ రాజ్ అంటూ అందరూ రాజ్ ని ప్రశంసిస్తారు. కానీ అపర్ణ మాత్రం ఫైర్ అవుతుంది.

కావ్యపై ఫైర్ అయిన అపర్ణ:

నీ వల్లే నా కొడుకు గొడవల వరకు వెళ్లాల్సి వస్తుంది. ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోతుంది అపర్ణ. ఇక ఆ తర్వాత కావ్య.. తాతయ్య గారూ నాదొక చిన్న రిక్వెస్ట్.. కాంట్రాక్ట్ తిరిగి వచ్చింది.. ఇప్పుడు విగ్రహాలు కాపాడింది ఆయనే కాబట్టి.. పండుగ రోజు మీ చేతుల మీదుగా మా అమ్మ వాళ్లకి ఇంటి పేపర్స్ ఇవ్వాలని ఆశ పడుతున్నాను అని చెబుతుంది. కుదరదు.. అలాంటివి నాకు అస్సలు నచ్చవు అని చెప్పేస్తాడు రాజ్. అయితే సీతారామయ్య చెప్పడంతో.. సరే తాతయ్య అని ఒప్పుకుంటాడు రాజ్.

రాహుల్ కి చివాట్లు:

ఇక విగ్రహాలు దొరకడం.. కావ్య ఆనందంగా ఉండటంతో ఆగ్రహంతో ఊగిపోతుంది రుద్రాణి. వెంటనే రాహుల్ కి కాల్ చేసి చెడా మడా వాయించేస్తుంది. రాహుల్ మాత్రం షాక్ అవుతాడు. ఏమైంది మమ్మీ అని అడుగుతాడు. నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. రాజ్ అక్కడే ఉన్నాడు కదా.. ఆ రౌడీలను రెండు బాది.. విగ్రహాలను తీసుకొచ్చేశాడు. నువ్వు చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ చెప్పేస్తుంది. రాహుల్ చెప్పేది కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తుంది రుద్రాణి.

స్వప్న మర్డర్ కోసం రాహుల్ ప్లాన్:

ఆ నెక్ట్స్ స్వప్న మర్డర్ కి పక్కా ప్లాన్ వేస్తాడు రాహుల్. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి స్వప్నని ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ చేయాలని చెప్తాడు. ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదని చెప్తాడు రాహుల్. ఈసారి అలాంటిదేమీ జరగదని.. ఖచ్చితంగా స్వప్నని చంపేస్తా అని అంటాడు రౌడీ. స్వప్నని చంపకపోతే.. ఈసారి నేను నిన్ను చంపేస్తా అంటాడు రాహుల్.

ఆనందంలో కావ్య:

ఆ తర్వాత రాజ్ ని ప్రశంసలతో ముంచెస్తుంది కావ్య. మీరు లేకపోయి ఉంటే.. అసలు మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్తుంది. నువ్వు అంత ఊహించుకోనవసరం లేదు. అంత ఎమోషనల్ అవ్వకు అంటాడు రాజ్. అది కాదండి మీరు నిన్ను ఆ సమయంలో అక్కడ లేకపోయి ఉంటే మా అమ్మావాళ్లకు ఆ ఇల్లు దక్కేది కాదు అంటుంది కావ్య. దీంతో ఆ పక్కన ఉన్న బొద్దికను చూసి భయపడతాడు రాజ్. దీంతో కావాలని రాజ్ ని ఆట పట్టిస్తుంది కావ్య. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.