Brahmamudi, September 22nd episode: అన్నంత పని చేసిన రుద్రాణి.. బాధలో కావ్య, కృష్ణమూర్తి ఫ్యామిలీ!!

|

Sep 22, 2023 | 11:21 AM

ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది బ్రహ్మముడి సీరియల్. మొత్తానికి ఈ రోజు కూడా బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని.. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ కావ్య.. తమ పుట్టింటి కష్టం తీర్చడం అత్తింటికి విరోధం అయింది. వాళ్లనే ఎదిరించి మరీ.. కృష్ణ మూర్తి ఫ్యామిలీకి అండగా నిలిచింది. అంతా సర్దుకుంది.. తమ కల నెరవేరబోతుంది అనే సమయానికి.. రుద్రాణి అడ్డంగా..

Brahmamudi, September 22nd episode: అన్నంత పని చేసిన రుద్రాణి.. బాధలో కావ్య, కృష్ణమూర్తి ఫ్యామిలీ!!
Brahmamudi
Follow us on

ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది బ్రహ్మముడి సీరియల్. మొత్తానికి ఈ రోజు కూడా బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని.. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ కావ్య.. తమ పుట్టింటి కష్టం తీర్చడం అత్తింటికి విరోధం అయింది. వాళ్లనే ఎదిరించి మరీ.. కృష్ణ మూర్తి ఫ్యామిలీకి అండగా నిలిచింది. అంతా సర్దుకుంది.. తమ కల నెరవేరబోతుంది అనే సమయానికి.. రుద్రాణి అడ్డంగా నిలిచింది.

బ్రహ్మముడి సీరియల్ ఇవాళ్టి (సెప్టెంబర్ 22) ఎపిసోడ్ లో.. కావ్యను ఎలా అయినా పతనం చేయాలని కంకణం కట్టుకుంది రుద్రాణి. అన్నట్టుగా రాహుల్ తో కలిసి ప్లాన్ అమలు చేయిస్తుంది. రాహుల్ చేసిన ప్లాన్ ప్రకారం రౌడీలు వినాయక విగ్రహాలను ఎత్తుకెళ్లడానికి వస్తారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కృష్ణ మూర్తిని చితక బాదుతారు. దీంతో రక్తంతో, గాయాలో కృష్ణమూర్తి స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత లారీలో విగ్రహాలను తరలించేస్తారు.

అటు కాంట్రాక్ట్ పూర్తై.. ఇల్లు చేతికి వస్తుందని ఎంతో ఆనందంగా ఉంటారు కనకం, కావ్య. ఈలోపు కృష్ణ మూర్తి దెబ్బలతో పడి పోయి ఉన్న విషయాన్ని బంటి వాళ్లకు చెప్తాడు. దీంతో వాళ్లు హడా విడిగా వస్తారు. అక్కడ కృష్ణ మూర్తి దెబ్బలతో పడి ఉండటాన్ని గమనించి అల్లాడిపోతారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. మనం పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని బాధ పడతారు. ఇదంతా చూసిన రాజ్ కూడా బాధ పడతాడు.

ఇవి కూడా చదవండి

ఈలోపు రాజ్ కి గుర్తొచ్చి.. మనం వచ్చేటప్పుడు ఒక డీసీఎం వ్యాన్ వెళ్తుంది.. అందులోనే విగ్రహాలను తరలించి ఉంటారు అంటూ రాజ్ అంటాడు. సరే అని అందరూ ఆ వ్యాన్ పట్టుకోవడానికి వెళ్తారు. ఇంకా ఇవాళ్టి ఎపిసోడ్ ఇంకెన్ని ట్విస్టులు నెలకొంటాయో పూర్తిగా తెలియాలంటే.. ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. కావ్యను తీసుకురావడానికి కృష్ణ మూర్తి ఇంటికి వెళ్తాడు రాజ్. అయితే కావ్య ఏమో.. ఈరోజు రాత్రికి ఇక్కడే ఉందం అండి.. కాంట్రాక్ట్ పూర్తి అవుతుంది కాబట్టి మీచేత గుమ్మడికాయ కొట్టించాలని అనుకుంటున్నాం.. అని అంటుంది. ఈలోపు అపర్ణ.. సీతారామయ్య దగ్గరకు వచ్చి ఇంత రాత్రి అయింది కావ్య ఇంకా రాలేదు.. ఇక పుట్టింటికి వెళ్లడానికి వీల్లేదని చెప్పండి మావయ్య అని అంటుంది. అందుకే రాజ్ ని పంపించా అని చెప్తాడు. రాజ్ కి కాల్ చేయగా.. ఈరోజు రాత్రికి ఇక్కడే ఉంటుందన్నాం అమ్మకి కూడా చెప్పండి అని రాజ్ సీతారామయ్యతో చెప్తాడు. ఓకే అంటాడు సీతారామయ్య. ఇదంతా విన్న రుద్రాణి.. రాహుల్ కి కాల్ చేసి అలర్ట్ చేస్తుంది. ఏదైనా విగ్రహాలు మాత్రం మాయం అవుతాయి అమ్మ అని చెప్తాడు రాహుల్. అన్నట్టుగానే రౌడీలు.. విగ్రహాలు ఉంచిన ప్లేస్ కి వెళ్తారు.