Bigg Boss Telugu 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరూ బ్యాగ్ సర్దుకోవాల్సిందే

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 9 12వ వారం ఎలిమినేషన్స్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వారం కెప్టెన్ రీతూ చౌదరి మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో హౌస్ నుంచి బయటకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss Telugu 9: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. ఇక ఆ ఇద్దరూ బ్యాగ్ సర్దుకోవాల్సిందే
Bigg Boss Telugu 9

Updated on: Nov 30, 2025 | 6:02 AM

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ దాదాపు తుది అంకాని వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఆదివారం (నవంబర్ 30) తో 12 వారాలు పూర్తి చేసుకుది. అంటే మరో మూడు వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే.. 12 వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే గ్రాండ్ ఫినాలేలో టాప్-5 ఉంటారా? టాప్-6 తీసుకుంటారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉండనుందని త తెలుస్తోంది. ఈ వారం కెప్టెన్ రీతూ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేషన్‌లో ఉన్నారు. కళ్యాణ్‌ పడాల, తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా గల్రానీ, భరణి, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, దివ్య నిఖిత నామినేషన్స్ లో నిలిచారు. శుక్రవారం రాత్రితో వీరికి ఆన్ లైన్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ ఓటింగ్ లో
కల్యాణ్ పడాల టాప్ ప్లేసులో నిలిచాడు. ఆ తర్వాతి ప్లేసులో తనూజ ఉంది. ఆ పై వరుసగా ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ, దివ్య ఉన్నారు.

ఆన్ లైన్ ఓటింగ్ సరళి ప్రకారందివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం బయటకొచ్చింది. గత వారం మిస్ అయినప్పటికీ ఈసారి ఆమె బయటకొచ్చేయడం గ్యారంటీ అని నెట్టింట టాక్ నడుస్తోంది. అయితే బిగ్ బాస్ షో ఇంకా కేవలం మూడు వారాలు మాత్రమే ఉండడంతో ఈ వారం మరొకరిని కూడా ఎలిమినేట్ చేయవచ్చని తెలుస్తోంది. అలా చూసుకుంటే సంజనా కూడా బ్యాగ్ సర్దుకోవాల్సిన పరిస్థితి. అలాగే సుమన్ శెట్టి కూడా ప్రస్తుతం డేంజర్ జోన్‌లోనే ఉన్నాడని టాక్. ఏదైనా బిగ్ షాక్ ఇవ్వాలనుకుంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఈ వారం దివ్యతో పాటు ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఆదివారం (నవంబర్ 30) ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఫైర్ మోడ్ లో కింగ్.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.