బిగ్‌బాస్ సీజన్ 6లో (Bigg Boss Season 6) నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. గత రెండు రోజులుగా ట్రాష్.. క్లాస్.. మాస్ అంటూ టాస్క్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మొదటివారంలో భాగంగా నామినేషన్స్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వహకులు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఫస్ట్ వీక్‌లోనే హౌస్‌లో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సింగర్ రేవంత్.. జబర్ధస్త్ ఫైమా.. యాంకర్ ఆరోహి మధ్య తీవ్రస్థాయిలో ఫైట్ జరిగినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సభ్యులలో తమకు ఇష్టం లేని వారి పేర్లు రాసి టాయిలెట్ సీట్లో వేసి ఫ్లష్ చేయాలని కోరారు బిగ్‌బాస్. ఇందులో మొదట రేవంత్.. ఫైమాను నామినేట్ చేస్తూ.. ఇప్పటివరకు ఆమె ఇంట్లో పనిచేయడం నేను చూడలేదు అని అనడంతో.. నేను చేసిన చోటుకి మీరు రాలేదేమో అంటూ కౌంటర్ వేసింది ఫైమా. దీంతో ఇంట్లో నేను లేనేమోలే అని అన్నారు రేవంత్.
ఇక ఆటలో ఆటకారులు మాత్రమే ఉంటారని.. కానీ రేవంత్ మాటకారి అంటూ పంచ్ వేసింది ఫైమా. ఇక ఈ ఆతర్వాత యాంకర్ ఆరోహికి.. సింగర్ రేవంత్ కు కూడా వార్ నడిచింది. ఆరోహిని నామినేట్ చేస్తూ.. అమ్మో వీడు లేచిండు అని అన్నదని రేవంత్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇలాంటి బద్నాములు చేస్తే ఊరుకోను అని.. ఎవరి ముందు అన్నానో చెప్పుడు అంటూ నిలదీసింది. నాకు గుర్తులేదు.. ఇది నా నామినేషన్ అంటూ రివర్స్ అయ్యాడు రేవంత్. దీంతో ఆరోహి.. రేవంత్ మధ్య మరింత గొడవ జరిగింది. నువ్వు 2మార్కుల ప్రశ్న అడిగితే 20 మార్కుల ఆన్సర్ ఎలా చెప్తారో.. నన్ను 20 మార్కుల ప్రశ్న వేస్తే 2000 వేల మార్కుల ఆన్సర్ చెప్తా అంటూ కౌంటర్ వేసింది. ఇక ఆ తర్వాత వాసంతి కృష్ణన్.. సీరియన్ నటి శ్రీసత్యను.. అర్జున్ కళ్యాణ్.. జబర్ధస్త్ ఫైమాను నామినేట్ చేశారు. అలాగే సుదీప, వాసంతి, కీర్తి, ఆరోహిలు సింగర్ రేవంత్‌ను నామినేట్ చేశారు. వెటకారం తగ్గించుకుంటే మంచిదని ఫైమాకు రేవంత్ కౌంటర్ వేయడంతో.. మీరు తగ్గించుకుంటే నేను తగ్గించుకుంటా అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. ఇక మొదటి వారం నామినేషన్లలో జబర్దస్త్ ఫైమా.. శ్రీసత్య, చలాకీ చంటి, బాలాదిత్య, ఇనయ, అభినయ శ్రీ, ఆరోహి, సింగర్ రేవంత్ నామినేట్ అయ్యినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.