బిగ్బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి అప్పుడే ఎనిమిది వారాలు గడిచిపోయింది. అయితే ఈ 8 వారాల్లో అతి తక్కువగా నామినేషన్లలో ఉన్నది మాత్రం ఆట సందీప్ మాత్రమే. దాదాపు ఏడు వారాలపాటు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూనే ఉన్నారు. కానీ మొదటిసారి ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. కొరియోగ్రాఫర్ ఆట సందీప్ గా ఇంట్లోకి అడుగుపెట్టి.. మొదటి నుంచి ఎంతో స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్నారు. అంతేకాకుండా మొట్ట మొదటి హౌస్మేట్ అయ్యారు. కానీ చాలాసార్లు అతని ఆట తీరుపై నాగ్ ఫైర్ అయ్యారు. దీంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరులో మార్పులు చేసుకుంటున్నారు. అయితే ఈవారం నామినేషన్స్ సమయంలో సందీప్ బూతులు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది మాత్రం తెలియదు. ఆ సమయంలో బీప్ వేశారు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత ఆ మాట పెద్ద చర్చే జరిగింది. ఇదిలా ఉంటే.. సందీప్ మాస్టర్ భార్య జ్యోతిరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అభిమానులు తమపై కామెంట్స్ చేస్తున్నారు.. చెప్పకూడని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జ్యోతిరాజ్ మాట్లాడుతూ.. “రియాల్టీ షో అంటే సందీప్ కు కొత్తేం కాదు. కానీ ఒక్కసారి వెళ్లారంటే కప్పు కొట్టాల్సిందే. ఆయనకు బిగ్బాస్ అనేది కొత్త అనుభం. డాన్స్ వేరు.. రియాల్టీ షో వేరు. అందరితోనూ సందీప్ కలవడానికి కాస్త టైమ్ తీసుకుంటారు. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకే బిగ్బాస్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే తన ఆశయం. ప్రశాంత్ కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు. ఇంకా అతడిని చెడగొడుతున్నారు. మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు. మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు. కుటుంబాలను ఎందుకు అందులోకి లాగుతున్నారు ?. ఆ విషయంపై నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. చెప్పకూడని మాటలు అంటున్నారు. ప్రశాంత్ తో పెట్టుకుంటే మాములుగా ఉండదు అతని జోలికొస్తే మిమ్మల్ని వదలం . అంటున్నారు. అతను లోపలికి వెళ్లేప్పుడు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు. కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు ” అంటూ చెప్పుకొచ్చారు. సందీప్ సేఫ్ గేమ్ ఆడడం లేదని.. ఎంతో కష్టపడి గేమ్ ఆడుతున్నాడని.. అందరితో మంచిగా ఉంటున్నాడని అన్నారు.
గతంలో సందీప్ పై వస్తోన్న ట్రోలింగ్స్ పై జ్యోతిరాజ్ ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. జీవితంలో సందీప్ చాలా కష్టపడి పైకి వచ్చారని.. ఆయనకు కళాకారుడిగా గుర్తింపు ఉందని.. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని.. కానీ ఇప్పుడు కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్ నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాటి వల్ల అతడి కుటుంబం చాలా బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.