Bigg Boss 7 Telugu: శోభా ఆటలో యావర్ బలి.. పిచ్చోడు అంటే శాంతంగా ఉండాలా ?.. ఇదేక్కడి లాజిక్కు..

|

Oct 29, 2023 | 11:26 AM

ఎర్రగడ్డ అన్నందుకు జీవితంలో క్షమించలేను అంటూ తెగ హడావిడి చేసింది. తప్పు తెలుసుకుని సారీ చెప్పినా వినకుండా వేరేలెవల్లో యాటిట్యూడ్ చూపించింది. తీరా తనను అనర్హురాలు అంటే మాత్రం పిచ్చోడు పిచ్చోడు అంటూ యావర్ మీద మీదకు వెళ్లింది. ప్రతి మాటకు నువ్వు పిచ్చోడివి.. కేవలం రోటీలు తినడానికే ఇక్కడకు వచ్చావ్ అంటూ అతడిని మాటలతో రెచ్చగొట్టింది. ఇంకేముంది అప్పటివరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న యావర్.. ఇక సహనం నశించి శోభా పై ఫైర్ అయ్యాడు.

Bigg Boss 7 Telugu: శోభా ఆటలో యావర్ బలి.. పిచ్చోడు అంటే శాంతంగా ఉండాలా ?.. ఇదేక్కడి లాజిక్కు..
Bigg Boss 7 Telugu
Follow us on

శోభా శెట్టి.. హౌస్‏లో ఒక్కోక్కరికి చుక్కలు చూపిస్తుంది. తనకు అవసరం ఉంటే అన్నా అంటుంది.. లేకపోతే పిచ్చోడు అంటుంది. మాట్లాడే మాట నుంచి తినే తిండి వరకు ప్రతి దానిలో చులకన చేసి మాట్లాడుతుంది. ఎర్రగడ్డ అన్నందుకు జీవితంలో క్షమించలేను అంటూ తెగ హడావిడి చేసింది. తప్పు తెలుసుకుని సారీ చెప్పినా వినకుండా వేరేలెవల్లో యాటిట్యూడ్ చూపించింది. తీరా తనను అనర్హురాలు అంటే మాత్రం పిచ్చోడు పిచ్చోడు అంటూ యావర్ మీద మీదకు వెళ్లింది. ప్రతి మాటకు నువ్వు పిచ్చోడివి.. కేవలం రోటీలు తినడానికే ఇక్కడకు వచ్చావ్ అంటూ అతడిని మాటలతో రెచ్చగొట్టింది. ఇంకేముంది అప్పటివరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న యావర్.. ఇక సహనం నశించి శోభా పై ఫైర్ అయ్యాడు. చేతిలో ఉన్న మిర్చి దండను నేలకేసి కొట్టాడు. ఎండిన మిర్చి దండను నేలకేసి కొట్టడం బిగ్‏బాస్ ప్రాపర్టీ అంటా.. అలా డ్యామేజ్ చేయడం తప్పంటా.. తన సైకోయిజంతో ఒక మనిషిని అన్నేసి మాటలు అన్న శోభాకు మాత్రం స్వీట్ వార్నింగ్ అంట.. ఇదేక్కడి లాజిక్కు. శోభాకు నాలుగు చురకలు.. స్వీట్ వార్నింగ్స్ ఇచ్చి కూర్చోమన్నారు. ఇక మిర్చి దండను విసిరేసినందుకు యావర్ పై సీరియస్ అయ్యారు. నీ బిహేవియర్ ఏంటీ.. ఈ బిహేవియర్ చూస్తే ఎవరైన పిచ్చోడనే అంటారు.. మళ్లీ పాత రోజులకు వెళ్లిపోయావ్ అంటూ ఫైర్ అయ్యారు. మిర్చి దండ విసిరినందుకే పిచ్చోడు అంటే.. మరీ మొదటి నుంచి భోలేను మోనిత అన్న మాటలు.. యావర్‏తో ప్రవర్తించిన తీరుతో మరీ శోభాను ఏమనాలో బిగ్ బాస్ హోస్ట్ కే తెలియాలి.

ఇక నాగార్జున క్వశ్చన్స్.. శోభా ఆనర్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. పిచ్చోడు అని ఎందుకు అన్నావ్ అంటే.. నన్ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాడు రీజన్.. కరెక్ట్ అనిపించలేదు అందుకే అన్నాను అని చెప్పేసింది శోభా. మరి గతవారం భోలే నిన్ను ఎర్రగడ్డ అంటే గింజుకున్నావ్.. నేను క్షమించలేను అన్నావ్.. మరి నువ్వు యావర్‏ను పిచ్చోడని ఎలా అంటావ్ .. అది కరెక్టేనా అంటూ అడిగేశారు. ‘నీకు క్షమించే గుణం లేనప్పుడు.. నువ్వు మాట జారకూడదు’ అంటూ చురకలు వేశారు. ఇక అంతే.. శోభా మ్యాటర్ ఆపేసి.. రివర్స్ యావర్ పై సీరియస్ అయ్యారు. పిచ్చోడు అంటే అలాగే బిహేవ్ చేస్తావా అంటూ నీ రియాక్షన్ కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు ముందుకెళ్తావ్ అంటూ సలహా ఇచ్చారు. అయితే రియాక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది.. కానీ శోభా ప్రవర్తన చూసిన వారికి యావర్ రియాక్షన్ అంత పెద్ద నేరంగా మాత్రం అనిపించడం లేదని అంటున్నారు. ఇద్దరిది తప్పని.. ఇద్దరిని హగ్ చేయించుకోమని.. శోభాతో సారీ చెప్పించాడు హోస్ట్ నాగార్జున.

అంతేకాదు.. హిట్లర్ అన్నాడంటూ యావర్ ను నామినేట్ చేసింది శోభా. దీంతో వీడియో చూపించి మరీ కళ్లు తెరిపించాడు. హిట్లర్ అన్నాడా అని నాగ్ అడగ్గా.. అలాగే వినిపించింది సార్ అంటూ అమాయకంగా చెప్పేసింది. నీకు డౌట్ ఉన్నప్పుడు అంత ఖరాఖండీగా ఎలా చెప్పావ్. మరి అంత కచ్చితంగా ఎలా చెప్పావ్… తనేం అంటే నువ్వేమి విన్నావ్.. హిట్లర్ అనే పదం అంటే నిన్ను అన్నట్లేనా.. నీ పద్దతి తప్పు.. నీ పాయింట్ కూడా తప్పే.. అంటూ శోభాకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ముందు అవతల వాళ్లు ఏం చెబుతున్నారో విను అంటూ శోభా జెండా విరగ్గొట్టేశారు. ఇక మొత్తానికి ఈ వారం తన ప్రవర్తనతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన శోభా అటు నామినేషన్స్ లోనూ సేవ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం శోభా, సందీప్ డేంజర్ జోన్ లో ఉండగా.. శోభా సేవ్ అయ్యి సందీప్ ఎలిమినేట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.