బిగ్బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం రసవత్తరంగా పోటీ జరుగుతుంది. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు ఇస్తున్న టాస్క్.. ‘ఈ మిర్చి చాలా హాట్ గురు’. ఈ టాస్కులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు బిగ్బాస్. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉండకూడుదని భావిస్తారో ఆ హౌస్మేట్ మెడలో మిర్చి దండను వేయాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్బాస్. ఇక ముందుగా వచ్చిన అమర్ దీప్.. ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ.. నీ పక్కన ఉన్న వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లకు వాళ్లు కాపాడుకోవాలి. మళ్లీ తిరిగి ఆడాలని వాళ్లకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో నాకు దండ వేస్తే వాళ్లు సేవ్ అవుతారు అనుకుంటే తప్పకుండా వేయు.. కానీ దీనికి నామినేషన్స్ కు ఏమైనా సంబంధం ఉందా అసలు అంటూ పాయింట్స్ మాట్లాడాడు ప్రశాంత్. ఇక్కడ నచ్చాల్సింది ఒకరిద్దరికి కాదు.. హౌస్ అందరికీ నచ్చాలి అంటూ మిర్చి దండను ప్రశాంత్ మెడలో వేశాడు అమర్.
ఇక భోలే మాట్లాడుతూ.. నాకు కనపడ్డ ఐదుగురిలో ప్రస్తుతం ఇప్పుడు నువ్వు అంటూ చెప్పగా.. ఇప్పుడు నేను ప్రశాంత్ లాగా మాట్లాడలా.. అమ్మా పక్కకు వెళ్లి ఆడుకోమ్మా అన్నట్లుగా ఉందంటూ సీరియస్ అయ్యింది ప్రియాంక. మధ్యలో ప్రశాంత్ గురించి ఎందుకు తీస్తున్నావ్ అని భోలే అడగడంతో నేను తీసుకుంటున్నా అంటూ రివర్స్ అయ్యింది ప్రియాంక. ఇక ఆ తర్వాత శోభా మెడలో మిర్చి దండ వేసింది రతిక. ఆ సమయంలో వీరిద్దరు మధ్య గొడవ జరిగింది. కెప్టెన్ అయ్యాక ఇదే బ్యాలెన్సింగ్ నీలో ఉండదని రతిక చెప్పగా.. వాళ్లు చెప్తారు నీకేంటీ ప్రాబ్లమ్ అంటూ గొడవ స్టార్ట్ చేసింది శోభా. రతిక మిర్చి దండ వేయడానికి ప్రయత్నిస్తుండగా.. వద్దంటూ పక్కకు వెళ్లిపోయింది.
ఇక ఆ తర్వాత నీలాగ చెత్త రీజన్ ఇవ్వను.. కానీ ఇస్తాను. ఇదే పరిస్థితి నాకు కూడా వస్తుంది.. నువ్వు ఇక్కడ నిలబడతావు. అప్పుడు నేను మాట్లాడుతా అంటూ సీరియస్ అయ్యింది. సరే అంటూ యావర్ ఆన్సర్ ఇవ్వగా.. పిచ్చొడు.. పిచ్చోడు అంటా అంటూ యావర్ మీద మీదకెళ్లి అరిచేసింది. దీంతో సహనం కోల్పోయిన యావర్.. నన్ను పిచ్చోడివి అంటావా అంటూ మిర్చి దండను నెలకేసి కొట్టాడు. వీరిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. మిర్చి దండను తనకు తానుగా మెడలో వేసుకుని పిచ్చిగా బిహేవ్ చేసింది శోభా. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.