Bigg Boss 6 Telugu: అందరినీ టార్గెట్ చేస్తానని.. చివరకు వెక్కి వెక్కి ఏడ్చేసిన గీతూ.. చేపల లొల్లి ఎంత పనిచేసింది..

|

Oct 26, 2022 | 11:22 AM

గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో వీలైనన్ని ఎక్కువ చేపల్ని పట్టుకుని జాగ్రత్తపరుచుకోవాలని బిగ్‏బాస్ సూచించాడు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత తక్కువ చేపలు ఉన్న జంట పోటీ నుంచి తప్పుకుంటుంది.

Bigg Boss 6 Telugu: అందరినీ టార్గెట్ చేస్తానని.. చివరకు వెక్కి వెక్కి ఏడ్చేసిన గీతూ.. చేపల లొల్లి ఎంత పనిచేసింది..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 6 ఎనిమిదవ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా చేపల చెరువు ఆనే టాస్క్ ఇచ్చారు. ఇందులో వీలైనన్ని ఎక్కువ చేపల్ని తమ బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక బిగ్‏బాస్ వార్నింగ్ తర్వాత ఇంటి సభ్యులు టాస్క్ ఆడేందుకు తెగ కష్టపడుతున్నారు. అయితే గేమ్ సవాలుగా తీసుకొని ఆడితే బాగుండేది… కానీ ఇష్టానుసారంగా ఆడుతూ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నారు. ఇదిలా ఉండే.. గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో వీలైనన్ని ఎక్కువ చేపల్ని పట్టుకుని జాగ్రత్తపరుచుకోవాలని బిగ్‏బాస్ సూచించాడు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత తక్కువ చేపలు ఉన్న జంట పోటీ నుంచి తప్పుకుంటుంది. ఇందులో సూర్య.. వాసంతి, రేవంత్.. ఇనయ, శ్రీహాన్.. శ్రీసత్య, బాలాదిత్య.. మెరీనా, ఆది రెడ్డి.. గీతూ, రోహిత్.. కీర్తి, రాజ్.. ఫైమా జంటలుగా ఉన్నారు.

అయితే ఫిజికల్‏గా రేవంత్ స్ట్రాంగ్ అని.. అతడిని రెచ్చగొడితే ఇనయ నుంచి చేపల్ని దొంగిలించవచ్చని ముందే ఆదిరెడ్డితో ప్లాన్ చేసింది గీతూ. అలాగే వాసంతి వద్ద నుంచి చేపల్ని దొంగిలించేందుకు తెగ ట్రై చేయగా.. సూర్య అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆదిరెడ్డిని హౌస్మెట్స్ బ్లాక్ చేసి గీతూ దగ్గరి నుంచి కొన్ని చేపల్ని లాగేసుకున్నారు. ఇక తర్వాత మెరీనా.. గీతూ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్దం నడిచింది. అందరినీ టార్గెట్ చేస్తాను.. నాకు ఉన్నన్ని గట్స్ ఎవరికీ లేవంటూ డైలాగ్స్ చెప్పింది.

ఇక చివరగా పూల్‏లో ఉన్న గోల్డ్ కాయిన్ రేవంత్‏కు దక్కగా.. గలాట గీతు.. ఆదిరెడ్డి జంట అందరి కంటే తక్కువ చేపల్ని సంపాదించిన జంటగా నిలిచింది. దీంతో గీతూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక ఎపిసోడ్ ముగిసే సమయానికి రేవంత్, ఇనయ వద్ద అత్యధికంగా 58 చేపలు ఉన్నాయి.