Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు

బిగ్ బాస్ హడావిడి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సీజన్ 5 మొదటి రోజు కాస్త సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ రెండో రోజు నుంచే గొడవలు..

Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు
Lobo

Updated on: Sep 12, 2021 | 4:58 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హడావిడి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సీజన్ 5 మొదటి రోజు కాస్త సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ రెండో రోజు నుంచే గొడవలు, ఏడుపులు మొదలు పెట్టారు. మొదటి రోజు ఇంటి సభ్యుల పరిచయం‌తో సాగిపోగా.. రెండో రోజు నామినేషన్ సెగ రాజేసింది. ఇక మూడో రోజు బిగ్ బాస్ హౌస్ రసావత్రరంగా సాగింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పటిలానే ఒకరి పై ఒకరు సీరియస్ అవుతూ హంగామా చేశారు. ఈ క్రమంలో కాజల్ పై లహరి గొడవకు దిగింది. దాంతో ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. చివరకు కాజల్ కన్నీళ్లు పెట్టక తప్పలేదు. తిరిగి తాను ఏడుస్తున్నది తన కూతురు చూస్తే తాను కూడా ఏడుస్తుందని తానకు తానే సర్ది చెప్పుకుంది కాజల్. అనంతరం రవి, మానస్‌లు ఆమెను ఓదార్చుతూ కనిపించారు. ఇదిలా ఉంటే లోబోని ఏకంగా మొఖం పగిలిపోద్ది అంటూ తిట్టేసింది సిరి.

సిరి – లోబో మధ్య గొడవ కాస్త గట్టిగానే అయ్యింది. లోబో-సిరిలు గట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. ముఖం అద్దంలో చూసుకో అని సిరిని లోబో అంటే.. నా ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది సిరి. పనిపాట లేదనుకుంటున్నావా అంటూ లోబో అంటే.. ఇక్కడ ఎవ్వరికి పనిపాట లేదు అంది సిరి. ఆ తర్వాత నువ్ చటాక్ అంత ఉన్నావ్.. నాతో పెట్టుకోకు అంటూ లోబో.. సిరి పై అటాక్  చేశాడు. అయితే వాళ్లు ఆట పట్టించడానికే గొడవపడినట్టు చివర్లో ట్విస్ట్ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇంటి సభ్యులంతా కంటెంట్ కోసం ఇలా చేయొద్దని చురకలు వేసింది హాట్ బ్యూటీ సరయు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ.. గొడవలే గొడవలు.. అటాక్ చేస్తే ఒప్పుకొనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బ్యూటీ..

Pawan Kalyan: వినాయకుడిపైనే ఆంక్షలా.. ఏపీ సర్కార్‌ తీరుపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్‌ మారో దమ్‌.. సిగిరెట్‌ తాగుతూ ముద్దుగుమ్మల రచ్చరచ్చ.!

 

Loading...
Unable to load recommendations.
Follow Us