Bigg Boss 5 Telugu Siri: పదిహేను వారాలకు సిరి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా..

|

Dec 20, 2021 | 8:32 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. నిన్న అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఇక బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలవగా

Bigg Boss 5 Telugu Siri: పదిహేను వారాలకు సిరి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా..
Siri Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. నిన్న అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఇక బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలవగా.. షణ్ముఖ్ రన్నరప్‏గా నిలిచాడు. 19 మందితో మొదలైన ఈ గేమ్ షో.. చివరకు ఐదుగురికి చేరింది టాప్ 5 కంటెస్టెంట్స్‏గా సిరి, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ నిలిచారు. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్‏లో మిగిలిన ఏకైక లేడీగా సిరి హన్మంత్ క్రేజ్ దక్కించుకుంది. పదిహేను వారాలు తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన సిరి.. నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలేలో 5వ కంటెస్టెంట్‏గా ఎలిమినేట్ అయింది.

పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ గా పేరు తెచ్చుకుంది సిరి హన్మంత్. ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరివి నీవంటూ బిగ్‏బాస్ సైతం సిరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్యూట్ నేస్ తో ఇంట్లో సభ్యులనే కాకుండా.. నాగార్జునను సైతం ఆకట్టుకుంది సిరి. టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచిన ఏకైక అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. గ్రాండ్‌ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ బయటకు వచ్చింది సిరి. ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు ఘనంగా తీసుకువచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్… హీరోయిన్ రష్మిక. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సిరి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వార్తలు చక్కర్లు కొడుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం… సిరి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నట్లుగా టాక్. ఈ లెక్కన చూసుకుంటే.. సిరి  పదిహేను వారాలకు గానూ .. సుమారు పాతిక లక్షల వరకు అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంటే విజేత గెలిచిన డబ్బులో సగం సిరి కూడా గెలిచినందనట్టు సమాచారం.

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..