బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసింది. సీజన్ 5 ట్రోఫిని వీజే సన్నీ ఎగరేసుకుపోయాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. శ్రీరామ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక మానస్ నాల్గవ స్థానంలో .. సిరి ఐదవ స్థానంలో నిలిచింది. అయితే గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద టాప్ 5 కంటెస్టెంట్ సభ్యుల కుటుంబాలు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సిరి తల్లి.. శ్రీదేవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
సిరి తల్లి శ్రీదేవి మాట్లాడుతూ బిగ్‌బాస్ ఇంట్లో చెప్పిన మాటల వలన అందరూ తిట్టారని చెప్పుకొచ్చింది. అలా చెప్పకూడదని అందరూ అన్నారంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు.. అమ్మ చెప్పకపోతే ఇంకెవ్వరూ చెబుతారు.. మీ మనసులో ఏముందో అది చెప్పారు కదా ? అందులో తప్పు లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి, షణ్ముఖ్ కు హగ్ చేసుకోవడం నచ్చలేదని శ్రీదేవి చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె అన్న మాటలు ట్రెండ్ అయ్యాయి.
సిరి ఎలిమినేట్ అయిన అనంతరం స్జేజ్ పైకి వచ్చి నాగార్జునను హగ్ చేసుకుంది. ఇక ఆతర్వాత.. సిరి తల్లి బాధపడిన విషయాన్ని ఆమెకు చెప్పాడు నాగార్జున. దీంతో సిరి స్పందిస్తూ.. మాది మధ్య తరగతి కుటుంబం.. అమ్మ చుట్టాల మాటలు ఎక్కువగా వింటుంది. ఆ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినవ కావు. అది నాకు తెలుసు.. పదిహేను వారాలు ననను భరించినందకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు లేనిది నేను లేను అంటూ చెప్పుకొచ్చింది సిరి.
Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..