బిగ్‌బాస్ సీజన్ 5 అసలైన సమయం ఆసన్నమైంది. వారం రోజులు హీట్ అండ్ ఫన్నీగా సాగిన షో.. శనివారం ఎలిమినేషన్ ఎవరవుతారు అనే ఉత్కంఠతో కొనసాగుతుంది. నాలుగు వారాలలో ముగ్గురు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన షో.. నలుగురు ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం ఇంట్లో పదిహేను మంది మిగిలారు. ఇక ఐదోవారం ఇంట్లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జెస్సీ, విశ్వ, హమీదా నామినేట్ అయ్యారు. ఇక ఈ తొమ్మిది మందిలో ఎవరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది.
అయితే ఇందులో ఎప్పటిలాగే.. షణ్ముఖ్, మానస్ సేఫ్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత.. సన్నీ, రవి సైతం సేఫ్ జోన్లో ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఈవారం తన ఆట తీరుతో ప్రేక్షకుల మద్దతు సంపాదించుకోవడంలో జెస్సీ సఫలమయ్యాడు. ఈవారం జరిగిన టాస్కులలో జెస్సీ ప్రవర్తన, ఆట తీరుతో ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి వారం పూర్తి నెగిటివి సంపాదించుకున్న జెస్సీ రాను రాను ఫుల్ ఫాలోయింగ్ అందుకుంటున్నాడనంలో సందేహం లేదు. ఇకపోతే.. ప్రియా… ముందు నుంచి నామినేట్ అవుతున్న ప్రియకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది. అంతేకాకుండా.. తాను చూసింది చూసినట్లుగా చెప్పడం.. కాంట్రావర్సీలు క్రియేట్ చేయకుండా జన్యూ్న్యుగా ఆడుతుందని నెట్టింట్లో టాక్. దీనిని బట్టి చూస్తే.. ఈ వారం కూడా ప్రియ సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు. విశ్వ, లోబో, హమీదా.. అయితే ఇప్పటివరకు ఇంట్లో ఉన్న ఏకైక ఎంటర్ టైనర్ లోబో. ప్రేక్షకులకు తన వంతు కామెడి పంచడమే కాకుండా.. ఇంట్లో సభ్యులను కూడా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అలాగే .. ఓటింగ్ పరంగా చూస్తే.. ఈసారి కొద్దిలో లోబో ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ లేకపోలేదు. ఇక విశ్వ విషయానికి వస్తే.. ఈవారంలో పూర్తిగా అగ్రేసివ్ అవ్వడం.. ఇష్టానుసారంగా ఇంటి సభ్యులపై విరుచుకుపడడం.. కేవలం రవి కోసమే గేమ్ ఆడడం తనకు మైనస్‌గా మారాయి. విశ్వ తన ఆటను పూర్తిగా రవికి అంకితమిచ్చేశాడని.. అతని కోసం ఇంటి సభ్యులను ఏమాత్రం లేక్కచేయకుండా.. అసభ్యపదజాలంతో దూషించడం పెద్ద మైనస్‌గా మారాయి. దీంతో ఈసారి విశ్వ పై ఆడియన్స్ కాస్త వ్యతిరేకంగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే … హమీదా.. బిగ్‌బాస్ కంటే ముందు హమీదా.. అస్సలు ఎవరికీ తెలీదు. ఇంట్లో వచ్చాక తన ఆట తీరుతో ఫేమ్ అవుతుందేమో అని చూసిన.. శ్రీరామచంద్రతో లవ్ ట్రాక్‌తో కావాల్సినంత ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చిన్న చిన్న విషయాలతో ఇతరులను నామినేట్ చేయడం.. శ్రీరామ చంద్ర కెప్టెన్ అయిన తర్వాత.. ఇంటికి పెద్ద తనే అనేలా వ్యవహరించడం.. కొందరి ఇంటి సభ్యులను టార్గెట్ చేయడంతో హమీదాపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా.. కేవలం శ్రీరామచంద్ర చుట్టూ తిరుగుతూ.. టాస్కులలో అస్సలు తన పర్ఫామెన్స్ చూపించడం లేదనేది హమీదాకు మైనస్. దీంతో ఈవారం అతి తక్కువ ఓట్లతో హమీదా డేంజర్ జోన్లో ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈవారం హమీదా ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉండగా..ఆమెను కాదని విశ్వను బయటకు పంపనున్నారట. హమీదాను కేవలం లవ్ ట్రాక్ కోసం ఇంట్లో ఉంచి… ఆమె స్థానంలో విశ్వను ఎలిమినేట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి గత సీజన్ల మాదిరిగానే.. ఈసారి కూడా బిగ్‌బాస్ ఎప్పటిలాగే.. లవ్ ట్రాక్ కోసం అమ్మాయి కోసం అబ్బాయిని బలి చేస్తున్నడానికి సోషల్ మీడియాలో టాక్. ఐదోవారం ఇంటి నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చినా హమీదాను కాకుండా.. విశ్వను ఎలిమినేట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఓట్లు తక్కువగా వచ్చినా హమీదాను ఎలిమినేట్ చేస్తాడా ? లేదా ? ఎప్పటిలాగే.. లవ్ ట్రాక్ కోసం ఆమె స్థానంలో విశ్వను ఎలిమినేట్ చేస్తాడా ? అనేది చూడాలి.
MAA Elections 2021: మా అధ్యక్ష పదవి కోసం మోనార్క్ vs మంచు.. ఇద్దరి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసా?