Bigg Boss 5 Telugu: బెస్ట్ ఎవరో.. వరస్ట్ ఎవరో.. సిరి ఆటీట్యూడ్ నచ్చలేదంటున్న యానీ మాస్టర్..

|

Oct 15, 2021 | 2:59 PM

బిగ్ బాస్ సీజన్ 5... నాలుగు వారాలు చప్పగా సాగిన గేమ్... ఐదవ వారం నుంచి రసవత్తరంగా సాగుతోంది.

Bigg Boss 5 Telugu: బెస్ట్ ఎవరో.. వరస్ట్ ఎవరో.. సిరి ఆటీట్యూడ్ నచ్చలేదంటున్న యానీ మాస్టర్..
Follow us on

బిగ్ బాస్ సీజన్ 5… నాలుగు వారాలు చప్పగా సాగిన గేమ్… ఐదవ వారం నుంచి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడిప్పుటే కంటెస్టెంట్స్.. టాస్కులలో తమ సత్తా చూపిస్తున్నారు. రోజుకో ట్విస్టులతో.. కావాల్సినంత గొడవలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమో.. మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇక నేటి ప్రోమోలో.. బిగ్ బాస్.. వరస్ట్ కంటెస్టెంట్.. బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ఇంకెముందు కెప్టెన్సీ టాస్కులో నచ్చని కంటెస్టెంట్స్ కు ఓట్లు వేశారు. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక గత రెండు రోజులుగా సాగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో సంచాలకులుగా ఉన్న సిరి… కాజల్ సిరిలు తమ ఇష్టానుసారంగా గేమ్ ఆడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన లోబో, శ్వేతలకు.. అలాగే సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ లకు బిగ్ బాస్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇక మొత్తానికి ఈవారం ఇంటి కెప్టెన్ విశ్వ్ అయ్యాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలు బెస్ట్.. వరస్ట్ సెలక్ట్ చేయాలని ఆదేశించాడు బిగ్ బాస్. ఇక ఇందులో ఎక్కువగా లోబో, సిరికి వరస్ట్ స్టాంప్ పడినట్లుగా తెలుస్తోంది. ఇక విశ్వ.. రవిని.. వరస్ట్ అనకుండానే.. వరస్ట్ స్టాంప్ వేశాడు. ఇక ఆ తర్వాత రవి.. జెస్సీని వరస్ట్ గా ఎంచుకోగా.. కాజల్.. రవిని వరస్ట్ కంటెస్టెంట్ స్టాంప్ వేసింది. ఇక సన్నీ.. సిరిని వరస్ట్ అనగా.. యానీ మాస్టర్…సిరి ఆడిట్యూడ్ తను తీసుకోలేనని ఇచ్చిపడేసింది. ఇక మానస్ సైతం… తనకు సిరి బిహేవియర్ నచ్చలేదని వరస్ట్ అనేశాడు.. మొత్తానికి సంచాలకురాలిగా అతి చేసిన సిరి ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు ఎక్కువగానే స్టాంప్స్ వేసినట్టుగా కనిపిస్తోంది.

Also Read:

Aryan Khan Drug Case: తల్లిదండ్రుల ముందు ఏడ్చిన ఆర్యన్.. కొడుకుకు వీడియో కాల్ చేసిన గౌరీ, షారూఖ్ ఖాన్‌