
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలుగులో 9 సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు 10వ సీజన్ రాబోతుంది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రోమోను రిలీజ్ చేశారు. గత సీజన్స్ కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత స్పెషల్ గా ఉండనుంది. ఈసారి దశావతారం అంటూ సరికొత్తగా ఉండనుందని ఇదివరకు ప్రోమోలో చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. ఇదిలా ఉంటే.. 9వ సీజన్లో అగ్నీ పరీక్ష పేరుతో సామాన్యులకు ఛాన్స్ ఇచ్చారు. మరీ ఈసారి కూడా బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఉండనుంది. దీంతో ఇందుకు సంబంధించి ఆడిషన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా అగ్ని పరీక్షకు సంబంధించిన వివరాలు షేర్ చేస్తూ మరో ప్రోమో రిలీజ్ చేశారు.
ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..
“బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష” (Bigg Boss 10 Agnipariksha) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ పదో సీజన్ అలరించబోతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించిన ఆడిషన్స్ ప్రక్రియ కూడా తాజాగా ప్రారంభమైంది. ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.. “లైఫ్‌లో అద్భుతాలు సాధించాలంటే సామాన్యుడికి అవకాశం కొన్నిసార్లే వస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చింది” అంటూ ఉత్సాహపరిచారు. ఈ సీజన్ ద్వారా సామాన్య ప్రజలకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సువర్ణావకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. టాలెంట్, హౌస్‌లో రాణించగల మనోధైర్యం ఉన్న ఎవరైనా ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఈ ‘అగ్నిపరీక్ష’లో భాగం కావాలనుకునే వారు తమ ఆడిషన్ వీడియోలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు http://bbtelugu.jiostar.com వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఎంట్రీలను అప్‌లోడ్ చేయాలి. ఈ ఆడిషన్ లైన్స్ జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమై, జూన్ 20వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల వారు తమ నటన, నైపుణ్యాలను చూపిస్తూ వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీలో ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలనుకుంటే వెంటనే ఆడిషన్స్‌లో పాల్గొనండి!
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..