Balakrishana : ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోన్న బాలయ్య..!

|

Feb 15, 2020 | 8:56 PM

Balakrishana : ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున తమ శైలిని మార్చుకున్నారు. ప్రజంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మల్టీస్టారర్‌తో పాటు వినూత్న స్క్రిప్టులను సెలక్ట్ చేసుకుంటున్నారు. అయితే మరో సీనియర్ హీరో బాలయ్య మాత్రం అదే కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మధ్యలో శాతకర్ణి వినూత్న ప్రయోగాలు చేస్తోన్నా..స్క్రిప్ట్ సెలక్షన్‌లో మాత్రం కాస్త వెనకబడే ఉన్నాడు . రిలేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇటీవల కొన్ని సినిమాలు చేసిన బాలయ్య..దెబ్బలు తగిలిన తర్వాత  […]

Balakrishana : ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోన్న బాలయ్య..!
Follow us on

Balakrishana : ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున తమ శైలిని మార్చుకున్నారు. ప్రజంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మల్టీస్టారర్‌తో పాటు వినూత్న స్క్రిప్టులను సెలక్ట్ చేసుకుంటున్నారు. అయితే మరో సీనియర్ హీరో బాలయ్య మాత్రం అదే కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మధ్యలో శాతకర్ణి వినూత్న ప్రయోగాలు చేస్తోన్నా..స్క్రిప్ట్ సెలక్షన్‌లో మాత్రం కాస్త వెనకబడే ఉన్నాడు . రిలేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇటీవల కొన్ని సినిమాలు చేసిన బాలయ్య..దెబ్బలు తగిలిన తర్వాత  కూడా మారకపోవడం గమనార్హం.

తాజాగా తనకు రెండు భారీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు నటసింహం. ఈ మూవీ తర్వాత తనకు గతంలో  ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన బి.గోపాల్‌తో మూవీకి కమిటయ్యాడట బాలయ్య. బి గోపాల్ ఒకప్పడు ఊర మాస్ డైరెక్టర్. ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు సాధించిన మాట వాస్తవమే. కానీ ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు ఆయన సినిమాలు తీయలేకపోతున్నారు.  చివరగా మ్యాచో హీరో గోపీచంద్‌తో తీసిన ‘ఆరడుగుల బుల్లెట్టు’ కనీసం రిలీజ్ కూడా అవ్వలేదు. ఈ పరిస్థితుల్లో బాలయ్య బి. గోపాల్‌కి సినిమా ఇవ్వడం నిజంగా సాహసమే అంటున్నారు ఫిలిం క్రిటిక్స్. ఇక సినిమాకు రైటర్ కూడా అదే పంథాకు చెందిన చిన్ని కృష్ణ అని టాక్ నడుస్తోంది. ఈయన రైటర్‌గా ఎప్పుడో విశ్రాంతి తీసుకున్నారు. ఈ మధ్య పాలిటిక్స్‌లో కాస్త హడావిడి చేశారు. ఇలా ఔట్ డేట్ అయిపోయిన టీమ్‌తో బాలయ్య ఎటువంటి మూవీ తీస్తాడో అని ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.