Rajeev Rayala |
Apr 24, 2021 | 6:31 AM
బుల్లితెరపైనా రాణిస్తుంది వెండి తెరపైన వెలుగుతున్న భామ అనసూయ. టీవీ షోలతో అలరిస్తూనే సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ బ్యూటీ.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ అమ్మడుకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
అడవిశేష్ నటించిన క్షణం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది అనసూయ.
ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరిసి తన అందంతో కట్టిపడేసింది.
సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అందమైన ఫొటోలతో నెటిజన్స్ ను ఆకర్షిస్తుంది.
ప్రస్తుతం అనసూయ రవితేజ నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాలోను ఓ పాత్ర చేస్తున్నట్టు సమాచారం.