‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. దానికంటే ముందే ‘ప్రేమమ్’లో మలర్ పాత్రలో అభిమానుల సంపాదించుకుంది. ఇక తెలుగులో ఫిధా చిత్రంతో పిచ్చెక్కించింది. ఇక తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్మకత్వంలో.. నాగ చైతన్యకి జోడీగా ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తుంది. దీంతో పాటు వేణు ఉడుగుల డైరెక్షన్‌లో ‘విరాట పర్వం’ చిత్రంతో కూడా బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా మలయాళంలో కూడా సాయి పల్లవికి బాగానే అవకాశాలు వస్తున్నాయి. కానీ తమిళనాట మాత్రం ఈ అమ్మడికి అస్సలు అవకాశాలు రావడం లేదు. సొంత భాషలో ఎలాగైనా సత్తా చూపించాలని కలలు కంటోంది సాయి పల్లవి. కోయంబత్తూరు నుంచి వచ్చిన ఈమె ముందుగా మలయాళ మూవీతో ఫేమస్ కావడంతో.. అందరూ కేరళ కుట్టి అనుకున్నారు. కానీ తాను తమిళ అమ్మాయిని అంటూ ఇప్పటికే రెండు, మూడు సార్లు కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే అక్కడ మారి-2, సూర్యతో ఎన్జీకే, కణం లాంటి సినిమాలు చేసింది. అయితే అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
దాంతో సొంత భాషలో సాయి పల్లవికి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అందుకే దర్మక నిర్మాతలు ఈ బ్యూటీకి అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకి తమిళనాట అవకాశాలు కరువైపోయాయి. కానీ సాయి పల్లవికి మాత్రం .. తన సొంత భాషలో సత్తా చూపించాలనే కోరిక అలానే ఉండిపోయింది.
Read More:
బ్రేకింగ్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే