Tollywood : అందుకే జబర్ధస్త్ షో మానేశాను.. కారణం చెప్పిన లేడీ కమెడియన్..

సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నటనపై ఆసక్తితో చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ ప్రతిభ మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుంటారు. కొందరు మాత్రమే సినిమా ప్రపంచంలో తమదైన ముద్రవేశారు. అయితే కెరీర్ తొలినాళ్లల్లో అనేక అవమానాలు, విమర్శలు సైతం ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఓ లేడీ కమెడియన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Tollywood : అందుకే జబర్ధస్త్ షో మానేశాను.. కారణం చెప్పిన లేడీ కమెడియన్..
Nellore Neeraja

Updated on: Dec 24, 2025 | 9:07 AM

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినీరంగంలోనూ రాణిస్తున్నారు. కేవలం హీరోహీరోయిన్లు మాతమ్రే కాదు.. కమెడియన్స్ సైతం యూట్యూ్బ్, నెట్టింట ఫేమస్ అయ్యారు. ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటున్న తారలు చాలా మంది ఉన్నారు. వారిలో నెల్లూరు నీరజ ఒకరు. యూట్యూబ్ లో వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, కామెడీ స్కిట్స్ చేసి పాపులర్ అయ్యింది నెల్లూరు నీరజ. మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ పాపులర్ తోనే జబర్దస్త్ షోలో అవకాశం అందుకుంది. అయితే ఇటీవల ఆమె జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చమ్మక్ చంద్ర చేసిన కొన్ని వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని నీరజ తెలిపారు.

తన భర్త సుబ్బు క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్న సమయంలో జబర్దస్త్ షూటింగ్‌కు వెళ్లలేకపోయారని, ఈ నేపథ్యంలో చమ్మక్ చంద్ర క్యాటరింగ్ వ్యాపారం ఉన్నప్పుడు కామెడీ షోలు ఎందుకు చేయాలి? అని ప్రశ్నించినట్లు ఆమె అన్నారు. ఇది తమకు అవమానకరంగా అనిపించిందని, ఒక ఆర్టిస్ట్ కు ఇతర వ్యాపారాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర మనస్తాపం చెంది జబర్దస్త్ నుండి బయటకు వచ్చినట్లు నీరజ వివరించారు. జబర్దస్త్ లోని స్క్రిప్ట్‌ నాణ్యత కూడా తమను అసంతృప్తికి గురి చేసిందని నీరజ అన్నారు. స్కిట్లలో 70% ఆరోగ్యకరమైన హాస్యం ఉన్నా, 30% మాత్రం బూతుతో నిండి ఉంటుందని, కొన్ని సందర్భాల్లో పూర్తి బూతుకు దారి తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల స్కిట్లు పండక, సుబ్బు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జబర్దస్త్ టీం లీడర్‌గా ఉన్నప్పటికీ, తమకు తగిన గౌరవం లభించలేదని, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక ప్లాట్‌ఫారమ్‌ను వదిలివేయడం మంచిదని తాము నిర్ణయించుకున్నామని ఆమె వివరించారు. మరో టీంలోకి వెళ్లమని అవకాశం ఇచ్చినా, టీం లీడర్‌గా వచ్చిన తాము వేరే టీంలో మింగిల్ అవ్వడం ఇష్టం లేక ఆ షో మానేసినట్లు తెలిపారు.

అంతకుముందు, జబర్దస్త్ లోకి రాకముందు గెటప్ శ్రీను వద్ద సుబ్బు అవకాశం అడిగితే, ఆయన పట్టించుకోకుండా బ్లాక్ చేశారని నీరజ వెల్లడించారు. చాలా మంది తమను చిన్నచూపు చూశారని, పలకరించేవారు కూడా కాదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇన్ని అవమానాల మధ్య ఒక వేదికపై కొనసాగడం కంటే బయటకు రావడం మేలని నీరజ స్పష్టం చేశారు. ఈ ఘటనల తర్వాత చమ్మక్ చంద్ర ఎదురుపడినా తాను పలకరించలేదని, ఆయన కూడా మాట్లాడలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి :  Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..