మళ్లీ వార్తల్లోకి దగ్గుబాటి వారసుడు..!

మళ్లీ వార్తల్లోకి దగ్గుబాటి వారసుడు..!

ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా తమ్మడు అభిరామ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు. తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోనా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? లేక నిర్మాతగా..తండ్రి నుంచి బాధ్యతలు తీసుకుని తాత బాటలో రాణించబోతున్నాడా..? ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. అన్నీ కుదిరితే త్వరలోనే అభిరామ్ సిల్వర్ స్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో సురేశ్ […]

Ram Naramaneni

|

Dec 05, 2019 | 5:53 PM

ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా తమ్మడు అభిరామ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు. తన కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు. హీరోనా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? లేక నిర్మాతగా..తండ్రి నుంచి బాధ్యతలు తీసుకుని తాత బాటలో రాణించబోతున్నాడా..? ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. అన్నీ కుదిరితే త్వరలోనే అభిరామ్ సిల్వర్ స్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో సురేశ్ బాబు అసురన్ రిమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కీలక పాత్ర కోసం అభిరామ్‌ను సెలక్ట్ చేయబోతున్నట్టు వినికిడి.

చాలా రోజుల క్రితమే సీనియర్ డైరెక్టర్ వంశీ చేతులు మీదగా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్‌లో అభిరామ్‌ను హీరోగా లాంఛ్ చేద్దామనుకున్నారు. కానీ క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్ల అప్పుడు వర్కవుట్ అవ్వలేదు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ అభి కొన్నాళ్లు సైలెంటయ్యాడు. మంచి స్రిప్ట్ వస్తే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చని బ్రేక్ తీసుకున్నాడు. ఈ లోపులోనే శ్రీరెడ్డి ఎపిసోడ్ ఈ దగ్గుబాటి కుర్రోడి కెరీర్‌ను అతలాకుతలం చేసింది. చాలా రోజులవరకు అజ్ఞాతంలోకి వెళ్లిన అభిరామ్ ఈ మధ్యే పలు వేదికలపై కనిపిస్తున్నాడు. అయితే అసురన్‌లో ధనుశ్ పెద్ద కొడుకు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోల్ చుట్టూనే మూవీ అంతా తిరుగుతుంది. తెలుగు వెర్షన్‌కు మెరుగులు దిద్దడంతో ఆ క్యారెక్టర్ మరింత ఎలివేట్ అయిందని టాక్. దీంతో ఆ రోల్ అయితే  అభిరామ్ ఎంట్రీకి బాగుంటుందని దగ్గుపాటి ఫ్యామిలీ ఫీల్ అవుతందట. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu