Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!

|

Jan 08, 2025 | 11:55 PM

జనవరి 10న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ చిత్రం కోసం రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమా పూర్తి రన్‌టైమ్‌ 2:45 గంటలు ఉందని సెన్సార్‌ బోర్డ్‌ తెలిపింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మించారు. చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!
Game Changer
Follow us on

రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం గేమ్‌ చేంజర్‌ విడుదలకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్‌షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే సినిమా టికెట్‌ ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు (శుక్రవారం, జనవరి 10) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్‌ డే సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతినిచ్చింది. ఇక జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలావుంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్‌ షోకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట బెనిఫిట్‌ షో టికెట్‌ ధరను రూ.600 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..