తమిళ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ తళపతి. ఆయన నటించిన ప్రతీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాల్సిందే. ఈ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అటు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా విజయ్ సినిమాలకు తెలుగులో కూడా ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. లాక్డౌన్ సమయంలో సినిమాలకు దూరమైన అభిమానులు తాజాగా విజయ్ సినిమా సంక్రాతికి రిలీజ్ కాబోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్టార్ హీరో విజయ్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ మూవీని తెరకెక్కించనుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించనున్నారు. సంక్రాతి తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం చేసేలా సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఇక అన్ని పనులు అనుకున్నట్టుగా జరిగితే విజయ్ నటించబోయే మరో కొత్త సినిమా కూడా దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట ప్రొడ్యూసర్స్. వచ్చే ఏడాదిలో విజయ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ఫ్యాన్స్ తెగ సంబంరపడిపోతున్నారు.