AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో ఆ సెంటిమెంట్… ఈసారి అదే పనిచేయబోతోందా..? విన్నర్లుగా నిలిచిన ఆ ఇద్దరు…

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విషయంలోనూ అదే సెంటిమెంట్ వర్క్ అవబోతోందా..? మొదటి సీజన్ తప్ప, రెండు, మూడు సీజన్లలో జరిగిందే నాలుగో సీజన్‌లో జరగబోతోందా..? అదే జరిగితే విజేతగా ఎవరు నిలుస్తారో తెలుసా..? అయితే ఈ కథనాన్ని చదివేయండి...

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో ఆ సెంటిమెంట్... ఈసారి అదే పనిచేయబోతోందా..? విన్నర్లుగా నిలిచిన ఆ ఇద్దరు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 12:06 PM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విషయంలోనూ అదే సెంటిమెంట్ వర్క్ అవబోతోందా..? మొదటి సీజన్ తప్ప, రెండు, మూడు సీజన్లలో జరిగిందే నాలుగో సీజన్‌లో జరగబోతోందా..? అదే జరిగితే విజేతగా ఎవరు నిలుస్తారో తెలుసా..? అయితే ఈ కథనాన్ని చదివేయండి…

బిగ్‌బాస్ షోనే ఒక వింత. ఆ ఇంటికి చేరాక హీరోలు జీరోలవుతుంటారు, జీరోలు హీరోల‌వుతుంటారు. స్ట్రాంగ్ అనుకున్నవాళ్లు మ‌ధ్యలోనే ఎలిమినేట్ అవుతారు, ఊహించ‌ని కంటెస్టెంట్లు చివ‌రి వ‌ర‌కూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో జంత‌ర్‌మంత‌ర్ మాయ‌లు చోటు చేసుకునే చోటే బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ సీజన్లలో జరిగిన ఒక సాంప్రదాయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అదే నామినేసన్ సెంటిమెంట్… ఇంతకీ ఈ నామినేషన్ సెంటిమెంట్ ఏంటో… దాని కథ ఏంటో ఓసారి చూద్దాం….

11 సార్లు నామినేషన్‌లోకి…

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో అభిజిత్ ఇప్పటి వరకు 1 సార్లు నామినేట్ అయ్యాడు. నామినేషన్లో ఉన్న ప్రతీసారి అభి అత్యధిక ఓట్లతో తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగారు. అలా 11 సార్లు అభి నామినేట్ అవడంతో ప్రజల నుంచి అభిజిత్‌కు ఆదరణ లభించింది. ఆయనకు అత్యధిక ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో అభి ఇప్పుడు టాప్ 5 లో ఉన్నాడు. అయితే ఇన్నా్ళ్లు నామినేషన్‌లో ఉండడంతో అభి అభిమానులకు ఓట్లు వేయడం అలవాటైంది. సో గ్రాండ్ ఫినాలే, టైటిల్ రేసులో అభిని గెలిపించేందుకు అతడి అభిమానులు ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభిజిత్ విన్నర్ అనే క్యాంపేన్ చేస్తున్నారు.

రెండో సీజన్లో …

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ మిన‌హా రెండో సీజ‌న్‌లో కౌశ‌ల్ మండా కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. గీతా మాధురి త‌న‌కు ల‌భించిన సూప‌ర్ ప‌వ‌ర్‌తో అత‌డిని సీజ‌న్ మొత్తం నామినేట్ చేసింది. అయినా స‌రే ప్రతిసారి ఎక్కువ ఓట్లతో సేవ్ అవుతూ…కౌశల్ చివ‌రికి విజేత‌గా నిలిచాడు.

మూడో సీజన్లో రాహుల్…

మూడో సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. పునర్నవిని నామినేష‌న్స్ నుంచి సేవ్ చేయ‌డం కోసం సీజ‌న్ మొత్తం త‌న‌ను తాను నామినేట్ చేసుకున్నాడు. అయినా స‌రే ప్రేక్షకుల స‌పోర్ట్‌తో చివ‌రికి ట్రోఫీని ఎగ‌రేసుకుపోయాడు. ఇక ఈసారి కూడా అభిజిత్ 11 సార్లు నామినేష‌న్‌లో ఉండి సేవ్ అవుతూ టాప్ 5లోకి చేరుకున్నాడు. దీంతో మ‌రోసారి 11 సెంటిమెంట్ వ‌ర్కవుట్ అయితే అభిజిత్ విజేతగా నిల‌వ‌డం ఖాయం అనిపిస్తోంది. మరి అది తెలియాలంటే డిసెంబ‌ర్ 20న‌ గ్రాండ్ ఫినాలే‌ కోసం ఎదురు చూడాల్సిందే

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి