14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక

| Edited By:

Nov 07, 2020 | 10:16 AM

రీల్ అండ్ రియల్‌ లైఫ్ హిట్‌ పెయిర్‌లలో సూర్య, జ్యోతిక ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు

14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక
Follow us on

Suriya Jyothika pair: రీల్ అండ్ రియల్‌ లైఫ్ హిట్‌ పెయిర్‌లలో సూర్య, జ్యోతిక ఒకరు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా సిల్లును ఒరు కాదల్‌ అనే మూవీలో కనిపించారు. ఇక ఆ తరువాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకోగా.. జ్యోతిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఐదేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన జ్యోతిక.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,607 కొత్త కేసులు.. 6 మరణాలు)

కాగా తాజాసమాచారం ప్రకారం ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి దర్శకురాలిగా పేరొందిన అంజలి మీనన్‌ వీరితో సినిమాను తీయబోతున్నట్లు సమాచారం. తమిళంలో సిల్లు కరుపట్టి మూవీతో మంచి పేరు సంపాదించిన హలితా షామీన్‌తో కలిసి అంజలి స్క్రిప్ట్‌ రాస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే 14 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక తెరపై రొమాన్స్ చేయనున్నారు. అలాగే ఈ జోడీని ఎప్పుడెప్పుడు మళ్లీ తెరపై చూస్తామా..? అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ కోరిక నెరవేరుతుంది. ( Bigg Boss 4:నీ ఫ్రెండ్‌షిప్ వద్దన్న మెహబూబ్‌.. సొహైల్‌కి కట్టలు తెంచుకున్న కోపం)