Sundari Movie Trailer: ‘సుందరి’ మూవీ ట్రైలర్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న పూర్ణ..

|

Feb 03, 2021 | 8:09 PM

టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'సుంద‌రి'. క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Sundari Movie Trailer: సుందరి మూవీ ట్రైలర్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న పూర్ణ..
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సుంద‌రి’. క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వ‌స్తోన్న ఈ చిత్రంలో పూర్ణ లీడ్ రోల్‏లో న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా విడుదలైన సుందరీ.. పల్లెటూరు అంటేనే అందం. అలాంటి అందమైన ఊర్లో ఒక అందమైన అమ్మాయి కథ అంటూ మొదలైవుతుంది ట్రైలర్. ఒక గృహిణికి జరిగిన అన్యాయాన్ని తను ఎదుర్కోగలిగింది అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో దేవత సీరియల్ ఫేం అర్జున్ అంబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.