AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: వెండి దారాలు, మేలు జాతి రాళ్లు.. కరీనా ధరించిన జాకెట్ ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

ఆమె అడుగుపెడితే ఆ ప్రాంతమంతా కొత్త వెలుగులు రావాల్సిందే. మూడు దశాబ్దాలుగా వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆ నటి.. ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్ సెట్టర్. ఐదు పదుల వయసు దరిచేరుతున్నా, నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చే ఫిట్‌నెస్‌తో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు.

Kareena Kapoor: వెండి దారాలు, మేలు జాతి రాళ్లు.. కరీనా ధరించిన జాకెట్ ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్
Kareena Kapoor Khan..
Nikhil
|

Updated on: Feb 01, 2026 | 6:30 AM

Share

ఇటీవల ఒక అంతర్జాతీయ వేదికపై ఆమె కనిపించిన తీరు చూసి ఫ్యాషన్ ప్రియులు షాక్ అవుతున్నారు. కేవలం ఆమె వేసుకున్న ఒక జాకెట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆ జాకెట్ విలువ తెలిస్తే సామాన్యులు కళ్లు తేలేయాల్సిందే. వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసి, విలువైన స్టోన్లతో మెరిసిపోతున్న ఆ ఖరీదైన డ్రెస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం..

బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ అబుదాబిలో జరిగిన ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కరీనా లుక్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. విలాసవంతమైన లగ్జరీ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కరీనా, తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో అందరి కళ్లూ తనవైపే తిప్పుకునేలా చేశారు. శ్వేతా కపూర్ నేతృత్వంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బృందంతో కలిసి ఆమె ఈ వేడుకలో సందడి చేశారు.

ఓపాల్ సెట్ – ధర వింటే షాక్​

ఈ వేడుక కోసం కరీనా ఎంచుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బ్రాండ్ బ్రైడల్ కలెక్షన్ నుంచి ఆమె తెల్లటి దుస్తులను ధరించారు. దీనికి అదనంగా చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి జాకెట్‌ను ధరించి రాయల్ లుక్‌లో కనిపించారు. నిజానికి ఈ డ్రెస్‌ని ‘ఓపాల్ సెట్’ అని పిలుస్తారు. దీని ధర సుమారు రూ. 5 లక్షల పైనే ఉంటుందని సమాచారం. కేవలం ఒక డ్రెస్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం కరీనా రేంజ్ ఏంటో చెబుతోంది.

View this post on Instagram

A post shared by Faisal AK (@_faisal_akf)

తెల్లటి శాటిన్ క్లాత్‌పై వెండి దారాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఈ జాకెట్‌కు ప్రాణం పోసింది. దీనిపై మేలుజాతి స్టోన్లను పొదిగి అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఈ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా కరీనా డైమండ్ చెవిపోగులు, ఉంగరాన్ని ధరించి మరింత ప్రకాశవంతంగా కనిపించారు. జడను బన్ స్టైల్‌లో వేసుకుని తన ఆహార్యానికి పూర్తి న్యాయం చేశారు. లేత గులాబీ రంగు లిప్‌స్టిక్, స్మోకీ ఐషాడో, కనురెప్పలకు మస్కారాతో కరీనా మేకప్ కూడా ఆ డ్రెస్‌కు హైలైట్‌గా నిలిచింది.

కరీనా కపూర్ ఎప్పుడూ తన ఫ్యాషన్ విషయంలో రాజీ పడరు. ఏదైనా వేడుకకు హాజరవుతున్నారంటే అక్కడ తన ముద్ర ఉండాలని ఆమె కోరుకుంటారు. అబుదాబి జ్యువెలరీ షాప్ ఈవెంట్ లో కూడా ఆమె అచ్చం ఒక దేవకన్యలా మెరిసిపోయారు. వయసు పెరుగుతున్నా తన గ్లామర్ ను మెయింటైన్ చేయడంలో ఆమె రహస్యం ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ధరించిన ఈ ఐదు లక్షల డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ ఫోటోలుగా మారిపోయాయి. స్టైల్ విషయంలో కరీనా కపూర్‌కు సాటి ఎవరూ లేరని ఈ అబుదాబి వేడుక మరోసారి నిరూపించింది. ఐదు లక్షల ఖరీదైన జాకెట్‌తో ఆమె చేసిన ఫ్యాషన్ హంగామా అందరినీ ఆకట్టుకుంటోంది.

Follow Us
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?