‘దేవసేనా’! రెడీయేనా.?

|

Apr 22, 2019 | 12:18 PM

తెలుగు బుల్లి తెరపై అత్యంత వివాదాస్పదమైన షో గా పేరు తెచ్చుకుంది ‘బిగ్ బాస్’. ఈ షో మొదటి భాగానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా.. రెండో భాగానికి నాని హోస్ట్ గా చేశాడు. అయితే త్వరలో రాబోయే మూడో సీజన్ కు హోస్ట్ గా స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మూడో సీజన్ కోసం నిర్మాతలు మొదట ఎన్టీఆర్ ను సంప్రదించగా..  […]

దేవసేనా! రెడీయేనా.?
Follow us on

తెలుగు బుల్లి తెరపై అత్యంత వివాదాస్పదమైన షో గా పేరు తెచ్చుకుంది ‘బిగ్ బాస్’. ఈ షో మొదటి భాగానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా.. రెండో భాగానికి నాని హోస్ట్ గా చేశాడు. అయితే త్వరలో రాబోయే మూడో సీజన్ కు హోస్ట్ గా స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు మూడో సీజన్ కోసం నిర్మాతలు మొదట ఎన్టీఆర్ ను సంప్రదించగా..  ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించలేనని ఎన్టీఆర్ చెప్పేశాడట. దాంతో ప్రత్యామ్నాయం కోసం చూసి చివరకు అనుష్క ను ఎంపిక చేశారట. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇది గనక నిజమైతే అనుష్క హోస్ట్ గా ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.