ఇక్కడ హద్దులు ఎక్కువ.. సౌత్‌ మూవీ ఇండస్ట్రీపై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

చాలామంది హీరోయిన్లు దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్​లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. శ్రీదేవి, తాప్సీ, రకుల్​, పూజా హెగ్డే.. ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాదిన స్టార్​డమ్​ తెచ్చుకున్నాక తమ కెరీర్‌ను విస్తరించుకోవడానికి బాలీవుడ్ వైపు వెళ్లినవాళ్లే. కానీ, ఈ మలుపు వెనుక ..

ఇక్కడ హద్దులు ఎక్కువ.. సౌత్‌ మూవీ ఇండస్ట్రీపై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
South Heroine

Edited By: TV9 Telugu

Updated on: Dec 03, 2025 | 3:50 PM

చాలామంది హీరోయిన్లు దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్​లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. శ్రీదేవి, తాప్సీ, రకుల్​, పూజా హెగ్డే.. ఇలా చాలామంది హీరోయిన్లు దక్షిణాదిన స్టార్​డమ్​ తెచ్చుకున్నాక తమ కెరీర్‌ను విస్తరించుకోవడానికి బాలీవుడ్ వైపు వెళ్లినవాళ్లే. కానీ, ఈ మలుపు వెనుక దాగి ఉన్న సవాళ్లు, అవకాశాలు ఏమిటి? దక్షిణ చిత్రాల్లో ‘హద్దులు’ ఉంటాయని, బాలీవుడ్‌లో అవి లేవని ఓ స్టార్​ హీరోయిన్​ ఓపెన్​గా కామెంట్​ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు హిందీ సినిమాల్లోకి ప్రవేశిస్తున్న ఆ హీరోయిన్​ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్​? .

దక్షిణాది సినీపరిశ్రమపై వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన రాశీకన్నా. మొదటి సినిమాకే మంచి పేరుతెచ్చుకున్న రాశీ వరుస అవకాశాలతో తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ రాణిస్తోంది. ఇటీవల తెలుగులో ‘తెలుసు కదా’ సినిమాలో నటించిన రాశీ, అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. కానీ, ఇటీవల రాశీకి సౌత్‌లో అవకాశాలు తగ్గిపోతున్నాయని, దాంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా సౌత్​ సినిమా గురించి మాట్లాడుతూ ‘దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది సినిమాల్లో హద్దులు లేవు. సౌత్‌లో అనేక కమర్షియల్‌ చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పుడు హిందీలో ప్రవేశించేందుకు ఇదే సరైన తరుణం. కథ డిమాండ్‌ మేరకు అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి,’ అని రాశీ కన్నా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది. ఆమె మాటల్లో, సౌత్ సినిమాలు కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితమవుతాయి.

Raasi Khanna

అక్కడ పాత్రలు, కథలు కొన్ని ‘హద్దుల’‌లోనే ఆగిపోతాయి. ‘ముఖ్యంగా దక్షిణాదిలో కమర్షియల్‌ చిత్రాల్లో నటించడం ఇష్టమే అయినప్పటికీ ఇక్కడ నాకంటూ కొన్ని హద్దులున్నాయి. నటిగా ఈ హద్దులను దాటి నా ప్రతిభను నిరూపించుకుని, నాకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకోవాల్సి ఉంది,’ అంటూ రెండు పరిశ్రమల మధ్య తేడా ఏంటో స్పష్టంగా చెప్పుకొచ్చింది.

రాశీ ఖన్నా ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, డైరెక్టర్​ హరీశ్​ శంకర్​ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, ఒక తమిళ చిత్రం, రెండు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రాశీ కన్నా మాటలు దక్షిణాది సినిమా పరిశ్రమకు ఓ మంచి మెసేజ్‌గా మారనున్నాయి. కమర్షియల్ సినిమాలు ఆకర్షణగా ఉన్నా, నటులు తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించుకోవాలంటే ‘హద్దులు’ దాటాల్సిందే!