ఎవరు మా ఇంటికి రావొద్దు.. ఫ్యాన్స్‏కు రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు కారణం ఎంటంటే ?

|

Jan 30, 2021 | 11:30 AM

తమిళ స్టార్ హీరో శింబు తన అభిమానులకు విజ్ఞప్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‏గా మారింది. తాను ఎంతోమంది ప్రేమాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి

ఎవరు మా ఇంటికి రావొద్దు.. ఫ్యాన్స్‏కు రిక్వెస్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు కారణం ఎంటంటే ?
Follow us on

తమిళ స్టార్ హీరో శింబు తన అభిమానులకు విజ్ఞప్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‏గా మారింది. తాను ఎంతోమంది ప్రేమాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని పేర్కోన్నారు. కారణం ఎంటంటే.. ఫిబ్రవరి 3న శింబు పుట్టిన రోజు. ఆరోజున శింబు 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సంధర్బంగా తన పుట్టిన రోజున అభిమానులెవరూ దయచేసి తన ఇంటికి రావొద్దని అభిమానులను కోరారు శింబు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. “జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ మీ ప్రేమాభిమానాలు మాత్రం ప్రతిక్షణం నాతోనే ఉన్నాయి. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం మీ అభిమానమే. నేను నటించిన ‘ఈశ్వరన్’ సినిమాపై మీరు చూపించిన ప్రేమకు ఎంతలా కృతజ్ఞతలు తెలిపిన తక్కువే. ఫిబ్రవరి 3న నా పుట్టిన రోజును మీతోనే జరుపుకోవాలనుకున్నాను.. కానీ చాలా రోజులుగా ఒకచోటుకి వెళ్ళాలని అనుకున్నాను. ఈసారి అక్కడికే వెళ్తున్నాను. దయచేసి మా ఇంటికి ఎవరు రావొద్దు” అని ట్విట్ చేశారు.