Sai Pallavi: అందాల బామ, భామ్మ‌గా మార‌డానికి ఎంతలా క‌ష్ట‌ప‌డిందో చూశారా.? వీడియో చూస్తే షాక్ కావాల్సిందే..

|

Jan 20, 2022 | 6:33 PM

SaiPallavi: పాత్ర కోసం ప్రాణం పోసే న‌టీమ‌ణుల్లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. అత్యంత స‌హ‌జంగా న‌టించ‌గ‌ల‌ద‌నే పేరున్న సాయిప‌ల్ల‌వి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసందే. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్న ఎక్క‌డా..

Sai Pallavi: అందాల బామ, భామ్మ‌గా మార‌డానికి ఎంతలా క‌ష్ట‌ప‌డిందో చూశారా.? వీడియో చూస్తే షాక్ కావాల్సిందే..
Follow us on

Sai Pallavi: పాత్ర కోసం ప్రాణం పెట్టే న‌టీమ‌ణుల్లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. అత్యంత స‌హ‌జంగా న‌టించ‌గ‌ల‌ద‌నే పేరున్న సాయిప‌ల్ల‌వి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసందే. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్న ఎక్క‌డా గ్లామ‌ర్ పాత్ర‌ల జోలికి పోకుండా కేవ‌లం న‌ట‌న‌కు ప్రాధాన్యత ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమా సినిమాకు త‌న న‌ట‌ను మెరుగు ప‌రుచుకుంటూ దూసుకుపోతోందీ చిన్న‌ది. సాయి ప‌ల్ల‌వి ఓ సినిమాకు ఓకే చేసిందంటే క‌చ్చితంగా త‌న పాత్ర‌కు ప్రాయారిటీ ఉండేలా చూసుకుంటుంది.

ఇక పాత్ర కోసం ఎంత దూర‌మైనా వెళుతుంది. తాజాగా నాని హీరోగా తెర‌కెక్కిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ముసలావిడ పాత్ర కోసం సాయిప‌ల్ల‌వి మేకోవ‌ర్ అయిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే ఈ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి న‌టించిన తీరు ఒకెత్తైతే.. ఈ క్యారెక్ట‌ర్ మేక‌ప్ కోసం ఆమె ప‌డిన క‌ష్టం మ‌రొక ఎత్తు అని చెప్పాలి. తాజాగా ఈ మేక‌ప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ముఖాన్ని పూర్తిగా కప్పేసి గంట‌ల త‌ర‌బ‌డి మేక‌ప్ ఆర్టిస్టులు వేసిన మేక‌ప్‌, అందుకు సాయి ప‌ల్ల‌వి స‌హ‌క‌రించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

సాధార‌ణంగా హీరోలే ఇలాంటివి చేయ‌డానికి స‌హ‌సిస్తుంటారు. కానీ స‌హ‌జ‌త్వానికి పెద్ద పీట వేసే సాయిప‌ల్ల‌వి మాత్రం భామ్మ పాత్ర కోసం ఇంతలా క‌ష్ట‌ప‌డింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు న‌ట‌న‌పై సాయిప‌ల్ల‌వికి ఉన్న డెడికేష‌న్‌కు ఈ వీడియోనే నిద‌ర్శ‌నం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Medaram Jathara: ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర.. సకల ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర సర్కార్

AP CM YS Jagan: వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు.. ప్రతి జిల్లాలో విమానాశ్రయంః సీఎం జగన్

Google Maps: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మీరు ఎక్కాల్సిన‌ రైలు ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్స్ చెబుతుంది..