Sherlyn Chopra: పోర్నోగ్రఫి కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలువురు నటులను సైతం పోలీసులు విచారించారు. ఆ తర్వాత రాజ్ కుంద్రా బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు ఆరోపణల విషయమై.. శిల్పా దంపతులు నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా రాజ్‌కుంద్రాపై పలు ఆరోపణలు చేసింది. ఫోర్నోగ్రఫీకి సంబంధించి పలు విషయాలను సైతం అధికారులకు వివరించింది. ఈ ఆరోపణలన్నీ షెర్లిన్ చోప్రా రాజ్‌కుంద్రా జైలులో ఉన్న సమయంలో చేసింది. అయితే.. ఇటీవల సైతం రాజ్ కుంద్రా లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు పాల్పడ్డారని.. మోసం చేశాడని అతనిపై కేసు నమోదు చేయాలంటూ షెర్లిన్ పోలీసులను కోరింది.
ఈ నేపథ్యంలో షెర్లిన్ చోప్రాపై శిల్ప, రాజ్ కుంద్రా దంపతులు న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్ పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, కల్పితాలంటూ శిల్పా దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్ప, రాజ్‌కుంద్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. షెర్లిన్ చోప్రా ఆరోపణలు అవాస్తవమైనవని పేర్కొన్నారు. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేస్తోందంటూ పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించడానికి షెర్లిన్ ప్రయత్నిస్తుందని.. ఆమెపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
Also Read: