షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్‌గా జాన్ అబ్రహం.. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..

షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ఇద్దరు కలిసి మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై

  • uppula Raju
  • Publish Date - 11:06 am, Fri, 22 January 21
షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్‌గా జాన్ అబ్రహం.. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..

షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం ఇద్దరు కలిసి మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న పఠాన్ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. కాగా ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనె నటిస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలు పెట్టారు. కొంతమేరకు ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోలో షూటింగ్ పూర్తిచేసిన డైరెక్టర్ ప్రస్తుతం యాక్షన్ సీక్వన్సెస్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం 25 మందితో కూడిని టెక్నిల్ టీంను దుబాయి తీసుకెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, షారుఖ్, జాన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేందుకు డైరెక్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. దుబాయిలోని ఫేమస్‌ ప్రాంతాల్లో క్లైమాక్స్ చిత్రీకరణ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. స్క్రీన్‌పై షారుఖ్, జాన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

ఐపీఎల్ ప్రదర్శనపై మీమ్స్.. షేర్ చేసిన జిమ్మీ నీషమ్.. క్షమాపణలు చెప్పానంటూ మాక్స్‌వెల్ రెస్పాండ్..