
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 80 , 90వ దశకంలో తన అద్భుతమైన అందం, అభినయం, నాట్య ప్రతిభతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘హీరో’, ‘దామిని’, ‘ఘాయల్’, ‘మేరీ జంగ్’ వంటి సంచలన చిత్రాలతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, సుదీర్ఘకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
1981లో ‘ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకుడు సుభాష్ ఘై తెరకెక్కించిన ‘హీరో’ చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ చిత్రంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో వచ్చిన ‘దామిని’ చిత్రం ఆమె నటిగా అత్యున్నత శిఖరాలను తాకేలా చేసింది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్భాంధవుడు చిత్రంలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలోనే 1995లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్ వివాహం చేసుకున్న మీనాక్షి శేషాద్రి, ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలికి అమెరికాకు వెళ్ళిపోయారు. అక్కడ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, తన సొంత నృత్య పాఠశాలను ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులకు భరతనాట్యం , ఇతర భారతీయ నృత్య రీతులలో శిక్షణ అందించారు. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కొద్దికాలం క్రితం ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలు చేసేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆమె ఇటీవల వెల్లడించారు. కేవలం ప్రధాన పాత్రలే కాకుండా, కథకు ప్రాధాన్యమున్న ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని తెలపడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత అలనాటి స్టార్ హీరోయిన్ మళ్లీ తెరపైకి రానుండటంతో బాలీవుడ్‌లో ఈ రీఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..