Senior Actress Aamani : అన్నిసార్లు మనసుకు నచ్చిన పాత్రలు దొరకాలంటే అది సాధ్యం కాదు..

అలనాటి అందాల తారల్లో ఆమని ఒకరు. హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమని ఆతర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు...

Senior Actress Aamani : అన్నిసార్లు మనసుకు నచ్చిన పాత్రలు దొరకాలంటే అది సాధ్యం కాదు..

Updated on: Jan 27, 2021 | 9:39 AM

Senior Actress Aamani : అలనాటి అందాల తారల్లో ఆమని ఒకరు. హీరోయిన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమని ఆతర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఆతర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన అమ్మ దీవెన అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆమె మాట్లాడుతూ.. అన్నిసార్లు మనసుకు నచ్చిన పాత్రలు దొరకాలంటే అది సాధ్యం కాదు. కొన్ని పాత్రలు నచ్చక పోయినా చేయాల్సి వస్తుంది అని అన్నారు. విభిన్నమైన పాత్రలతో నటిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపన ఇంకా నాలో ఉంది. అలాగే తన సినిమా గురించి మాట్లాడుతూ.. కథానుసారంగా ఆద్యంతం నా పాత్ర చూట్టూనే సాగుతుంది. డీ గ్లామర్‌గా సాగే ఈ పాత్ర నటిగా నాకు చక్కటి సంతృప్తిని మిగిల్చింది. కష్టాలు ఎదురైతే ఆత్మహత్యతో జీవితాన్ని ముగించుకోవడం సరికాదని అడ్డంకులను ఎదురించి ధైర్యంగా పోరాడాలని చాటిచెప్పే చిత్రమిదని ఆమని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Master movie : డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైన దళపతి ‘మాస్టర్’.. రిలీజ్ ఎప్పుడంటే..