Actor Mahesh babu: ఎట్టకేలకు ‘సర్కారు వారి పాట’ ముహుర్తం కుదిరింది.. ఆ రోజు నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్..

|

Jan 12, 2021 | 1:21 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురాం కాంబినేషన్‏లో రాబోతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకులో జరిగే అక్రమాలు, స్మాముల నేపథ్యంలో ఈ

Actor Mahesh babu: ఎట్టకేలకు సర్కారు వారి పాట ముహుర్తం కుదిరింది.. ఆ రోజు నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్..
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురాం కాంబినేషన్‏లో రాబోతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకులో జరిగే అక్రమాలు, స్మాముల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మహేష్‏కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది.. తాజాగా ఈ సినిమా షూటింగ్‏ను జనవరి 25 నుంచి దుబాయ్‏లో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముందుగా హైదరాబాద్‏లో చేయాలని అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వలన చిత్రయూనిట్ దుబాయ్ వెళ్ళనున్నట్లు సమాచారం. దాదాపు 20 రోజుల పాటు రెగ్యూలర్ షూటింగ్ అక్కడే జరుగుతుందని.. ఆ తర్వాత రెండో షెడ్యూల్ హైదరాబాద్‏లో జరుగనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా చిత్రీకరణం మొత్తం మూడు నెలల్లో పూర్తయ్యేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటి విద్రా బాలన్ నటించనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: ‘సర్కారు వారి పాట’ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ .. జనవరి నుంచి ఏకధాటిగా షూటింగ్

Renu Desai clarifies rumours : మహేష్ సినిమాలో నటించడంపై స్పందించిన రేణుదేశాయ్.. ఏమన్నారంటే