Samantha: ఆ ఇద్దరి వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను.. వైరలవుతోన్న సామ్ లేటెస్ట్ పోస్ట్..

విడాకుల అంశాన్ని వీలైనంత వేగంగా మర్చిపోయేందుకు వరుసగా సినిమాలు చేస్తోంది సమంత. అందులో భాగంగా ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సామ్

Samantha: ఆ ఇద్దరి వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను.. వైరలవుతోన్న సామ్ లేటెస్ట్ పోస్ట్..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2022 | 9:26 AM

విడాకుల అంశాన్ని వీలైనంత వేగంగా మర్చిపోయేందుకు వరుసగా సినిమాలు చేస్తోంది సమంత. అందులో భాగంగా ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది సామ్. ఈ పాట యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది . ఇక హీరోయిన్ గా ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసిన సామ్… త్వరలోనే యశోద మూవీ సెట్ లో అడుగపెట్టనుంది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా  వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతోందీ ముద్దుగుమ్మ. కాగ సినిమా షూటింగ్ ల నుంచి ఏ మాత్రం తీరిక దొరికినా విహారయాత్రలకు చెక్కేస్తోంది సామ్.  ఇందులో భాగంగా  ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తోంది.

ఏదైనా గోల్డ్ మెడల్ తీసుకురారాదు?

కాగా స్విస్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది సామ్. ఈ సందర్భంగా ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘వీరిద్దరి వల్లే నేను ఇంకా బతికున్నాను’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి #skiingisbelieving అనే  హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది.  కాగా ఫొటోలో ఉన్న వీరిద్దరూ సామ్‌ స్కై ఇన్‌స్ట్రక్టర్లు అని తెలుస్తోంది. ‘స్కీయింగ్ అనేది సాహసోపేతమైన క్రీడ. ఏదైనా అనుకోకుండా జరిగితే ప్రాణాలు కూడా పోతాయి.  అయినా సరే నేను విజయవంతంగా స్కీయింగ్ టార్గెట్ పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం వీరిద్దరే’ అంటూ మరో వీడియోలో చెప్పుకొచ్చింది సామ్.  కాగా స్విస్ మంచుకొండల్లో సమంత చేస్తోన్న అడ్వెంచెరస్ స్టంట్లకు సెలబ్రిటీలు, అభిమానులు ఫిదా అవుతున్నారు.  ఈ సందర్భంగా సామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి  వీటిపై స్పందిస్తూ ‘కమాన్ సామ్.. ఏదైనా స్కీయింగ్ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం గెల్చుకురా’ అని కామెంట్ పెట్టింది.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..