“నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి… చూస్తారు గా” అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ … సినిమా పేరు వినగానే సమంత ఏజ్ కాస్త తగ్గింది అనిపిస్తుంది గానీ అసలు విషయం మాత్రం అరవై ఏళ్ళ బామ్మ ఆత్మ ఇరవై ఏళ్ళ అమ్మాయిలో కి వెళ్లి చేసే అల్లరి ఈ సినిమా కధాంశం . టీజర్ చూస్తే నాగసౌర్య, రాజేంద్రప్రసాద్, లక్ష్మి అన్ని పాత్రలు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మొత్తం సమంత చుట్టూ తిరిగే కథ అని అర్ధమవుతోంది . సమంత యాక్టింగ్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది అని అర్ధమైపోయింది . నందిని రెడ్డి తెలుగు లో చేసిన మార్పులు, సమంత చేసిన నటన మాత్రమే సినిమా భవిష్యత్ నిర్ణయించేలా వుంది టీజర్ చూసాక .