Salmankhan : బాలీవుడ్‌ కండల వీరుడికి ఊరటనిచ్చిన జోధ్ పూర్ కోర్టు.. ఏ విషయంలో తెలుసా..

Salmankhan : ఇరవై మూడేళ్ల క్రితం చేసిన ఓ పొరపాటు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను వేధిస్తూనే ఉంది. కృష్ణ జింకలను వేటాడిన

Salmankhan : బాలీవుడ్‌ కండల వీరుడికి ఊరటనిచ్చిన జోధ్ పూర్ కోర్టు.. ఏ విషయంలో తెలుసా..

Updated on: Feb 11, 2021 | 9:34 PM

Salmankhan : ఇరవై మూడేళ్ల క్రితం చేసిన ఓ పొరపాటు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను వేధిస్తూనే ఉంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఇంకా కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. ఆ మధ్య జరిగిన హిట్ అండ్ ర‌న్ కేసులో నుంచి నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ్డాడు కానీ కృష్ణజింక‌లు మాత్రం ఈయన్ని వదలడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్ పూర్ కోర్టు ఊరటనిచ్చింది. ఒకట్రెండు సార్లు కోర్టుకు రాకుండా న్యాయస్థానం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో బెయిల్ క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు సక్రమంగా కోర్టుకు హాజరవుతున్నాడు.

ఇదిలా ఉంటే కరోనా తర్వాత చాలా రోజులకు ఆ మధ్య జనవరి 17న కృష్ణజింకల కేసు మళ్లీ హియరింగ్‌కు వచ్చింది. కానీ అప్పుడు కూడా కోర్టుకు రాలేదు కండలవీరుడు. కరోనా నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ విన్నవించుకున్నాడు. ఆయన విన్నపాన్ని మన్నించిన కోర్టు.. తర్వాత రమ్మని చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కేసులో ఈయనకు ఊరట లభించింది. రాజస్థాన్ ప్రభుత్వం సల్మాన్ పై చేసిన ఆరోపణలో సాక్ష్యం లేదంటూ జోధ్ పూర్ కోర్ట్ తీర్పునిచ్చింది. కండల వీరుడు నకిలీ అఫిడవిట్ దాఖలు చేసాడంటూ రాజస్థాన్ సర్కార్ చేసిన ఆరోపణను కొట్టి పారేసింది. కేసు మాత్రం ఇంకా హియరింగ్‌లోనే ఉంది. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ అప్పట్లో రెండ్రోజులు జైల్లో కూడా ఉన్నాడు. ఆ త‌ర్వాత 2018లో ఈయనకు బెయిల్‌ వచ్చింది. అప్పట్నుంచి కూడా షరతులతో కూడిన బెయిల్ పైనే బయట ఉన్నాడు.

గోవాకు ‘సర్కారువారిపాట’ టీం..? దుబాయ్‌లో షూటింగ్ ముగిసినట్లేనా.. అసలు విషయం ఏంటో తెలుసా..