గూగుల్‌ ప్లేస్టోర్‌లో… ‘సాహో ది గేమ్‌’!

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2019 | 9:24 PM

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి విదితమే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి వారికి శుభవార్త. ‘సాహో ది గేమ్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ […]

గూగుల్‌ ప్లేస్టోర్‌లో... ‘సాహో ది గేమ్‌’!
Follow us on

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి విదితమే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి వారికి శుభవార్త. ‘సాహో ది గేమ్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.  ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.