AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళి దారిలో సుజీత్…?

ఒకే ఒక్క సినిమాతో ఇండియe వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన బెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్. ఇదే ఇప్పుడు మనోడి క్రేజ్ పెంచేసింది. ఇంత తక్కువ సమయంలో అలాంటి ఓ స్క్రిప్ట్ రాసుకుని.. అన్ని వందల కోట్లు పెట్టించడానికి నిర్మాతలను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. సాహో టాక్‌తో […]

రాజమౌళి దారిలో సుజీత్...?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 17, 2019 | 1:10 PM

Share

ఒకే ఒక్క సినిమాతో ఇండియe వైడ్‌గా పాపులర్ అయ్యాడు సుజీత్. సాహో సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన బెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమాను హ్యాండిల్ చేసాడు సుజీత్. ఇదే ఇప్పుడు మనోడి క్రేజ్ పెంచేసింది. ఇంత తక్కువ సమయంలో అలాంటి ఓ స్క్రిప్ట్ రాసుకుని.. అన్ని వందల కోట్లు పెట్టించడానికి నిర్మాతలను ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు.

సాహో టాక్‌తో పనిలేకుండా వారం రోజుల పాటు కుమ్మేసింది. ఇప్పుడంటే కలెక్షన్లు తగ్గిపోయాయి కానీ ఇప్పటికే 420 కోట్లకు పైగా వసూలు చేసిందని దర్శక నిర్మాతలే చెప్పారు. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఈ చిత్రం.. బయ్యర్లకు మాత్రం భారీ నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. కాగా… సాహో తర్వాత సుజీత్ ఏం సినిమా చేయబోతున్నాడు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. ఎవరితో చేయబోతున్నాడు… ఎందుకంటే సాహో లాంటి భారీ సినిమా తర్వాత ఈ కుర్రాడి అడుగులు ఎక్కడ పడతాయనేది అంతా ఆసక్తిగా చూస్తున్న అంశం. దీనికి ఆయన కూడా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చాడు.

ఈయన చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు మగధీర లాంటి భారీ సినిమా తర్వాత చాలా తెలివిగా ఎలాగైతే రాజమౌళి మర్యాద రామన్న సినిమా చేసాడో.. సుజీత్ కూడా ఇప్పుడు ఇదే దారిలో వెళ్తున్నాడు. అయితే స్క్రిప్ట్ ప్రస్తుతానికి సిద్ధం కాలేదని.. త్వరలోనే అన్ని వివరాలు చెప్తానంటున్నాడు ఈయన. ప్రస్తుతానికి ఇంకా సాహో మత్తులోనే ఉన్నట్లు చెప్పాడు సుజీత్. ఈ కుర్రాడి తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే